ఫ్రీ టూర్ కొట్టేసిన కాజల్.. ఎలాగో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అక్టోబర్ లో తను ప్రేమించిన గౌతమ్ కిచ్లు పెళ్లాడిన సంగతి తెలిసిందే. వివాహం అనంతరం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. మాల్దీవుల్లో నీటి అడుగున ఉన్న ది మురాకా హోటల్ లో కాజల్, గౌతమ్ లు కొద్దిరోజుల పాటు బస చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కాజల్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ఈ హాట్ లో ఒకరాత్రి బస చేయాలంటే దాదాపు రూ.38 లక్షలు ఖర్చు అవుతుందని.. పది రోజుల పాటు కాజల్ ఆ హోటల్ లో ఉన్నందుకు ఆమెకి దాదాపు రూ.5 కోట్ల ఖర్చు అయి ఉంటుందని కథనాలు వచ్చాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం.. కాజల్ తన హనీమూన్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలుస్తోంది. కరోనా కారణంగా టూర్లకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో పర్యాటకులను ఎట్రాక్ట్ చేసే పనిలో పడింది మాల్దీవుల ప్రభుత్వం. ముఖ్యంగా భారతీయులను ఆకర్షించే పనిలో ఓ స్ట్రాటజీ అమలు చేసింది. ఏ సెలబ్రిటీకైతే ఇన్స్టాగ్రామ్ లో రెండు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉంటారో.. వాళ్లు మాల్దీవులకు వచ్చినప్పుడు ఏ హోటల్ లో ఉంటారో అక్కడ ఫైవ్ స్టార్ భోజనాన్ని ఫ్రీగా ఇస్తారట. అలానే ఇన్స్టాగ్రామ్ లో 5 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీకి హోటల్ రూమ్, భోజనంతో పాటు రిటర్న్ టికెట్లు ఫ్రీగా ఇస్తారట.

ఈ ప్యాకేజ్ లో భాగంగానే కాజల్ మాల్దీవులకు వెళ్లినట్లు సమాచారం. కాజల్ కి ఇన్స్టాగ్రామ్ లో 16 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ది మురాకా హోటల్ యాజమాన్యం స్వయంగా ఫోన్ చేసి.. ఫ్రీ టూర్ గురించి చెప్పినట్లు తెలుస్తోంది. టూర్ కి సంబంధించిన ఫోటోలను మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేయమని కోరిందట. దీంతో కాజల్ ఎప్పటికప్పుడు తన హాలిడే ఫోటోలను షేర్ చేసిందని చెబుతున్నారు.

1

2

3

4

5

More..

1

2

3

4

5


6

7

8

9

10

11

12

13

14

15

16

17

more..

1

2

3

4

5

6

7

8

9

10

పెళ్లి ఫోటోలు
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36


Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus