లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేయనన్న కాజల్

ఎంతోమంది హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ కథల కోసం ఎదురుచూస్తుంటారు. సినిమా మొత్తాన్ని తనపై వేసుకొని శ్రమించి మంచి పేరు తెచ్చుకోవాలని భావిస్తుంటారు. అయితే కాజల్ అగర్వాల్ మాత్రం మంచి లేడీ ఓరియెంటెడ్ కథ తన దగ్గరకి వస్తే నో చెప్పిందంట. లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బాలీవుడ్ బ్యూటీ అనేక మంచి పాత్రలు పోషించి టాలీవుడ్ యువరాణిగా పేరుతెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటించి విజయాలను అందుకుంది. రీసెంట్ గా ఆమె నటించిన ‘అ !’ చిత్రం కూడా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం కాజల్ క్వీన్ రీమేక్ సినిమాలో నటిస్తోంది. అలాగే మరో రెండు ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. ఇటీవల తమిళ డైరెక్టర్‌ ఒకరు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాకు ప్లాన్‌ చేసుకున్నారు.

దాన్ని తెలుగు, తమిళం భాషలలో తీయాలని అనుకున్నారు. తెలుగు, తమిళంలో బాగా పరిచయమున్న కాజల్‌ మాత్రమే ఆ పాత్ర చేయగలదనీ, ఆమెను సంప్రదించారని సమాచారం. కథంతా విన్న కాజల్‌, తను ఈ సినిమా చేయలేనని ఖరాఖండిగా చెప్పేసిందట. కారణం ఏమిటని అడిగితే…”ఇప్పుడప్పుడే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేసే ఉద్దేశం నాకు లేదు, మరికొన్ని సంవత్సరాల తరువాత చేస్తాను ” అని చెప్పినట్లు తెలిసింది. హీరోయిన్ గా మంచిగా అవకాశాలు వచ్చేటప్పుడు ప్రయోగాలు చేసి పేరు ఎందుకు పోగొట్టుకోవాలని అనుకుందేమో కాజల్.. ఈ ఛాన్స్ ని వదులుకుంది. ఈ నిర్ణయం తీసుకుని అందమే కాదు బాగా తెలివైందని నిరూపించుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus