మన పురాణాలు మొదలుకొని నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను చూస్తే “ఆడదానికి ఆడదే శత్రువు” అనే సామెత ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతునే ఉంది. కానీ.. మొట్టమొదటిసారిగా ఆ సామెత అబద్ధం అని ప్రూవ్ చేశారు మన స్టార్ హీరోయిన్స్. వాళ్ళే సెక్సీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ & క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇద్దరూ పంజాబీలు కావడం. దాదాపుగా సమానమైన స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తుండడంతో వారిద్దరి మధ్య గత కొన్నాళ్లుగా మంచి స్నేహబంధం ఏర్పడింది. ట్విట్టర్ లో అయితే వారిద్దరూ ఒకరిపై మరొకరు చూపే ఆప్యాయతాభిమానాలు చూసి ఆశ్చర్యపోవడం ఖాయం.
ఆ స్నేహబంధంతోనే కాజల్ అగర్వాల్ తనకు వచ్చిన ఆఫర్ ను రకుల్ కి రిఫర్ చేసిందట. విషయం ఏంటంటే.. నాని నిర్మిస్తున్న “అ!” సినిమాలో కాజల్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆ చనువుతో నాని తన సరసన కథానాయికగా నటించమని కాజల్ ను అడగ్గా.. ఆమె ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించి, ఆ ఆఫర్ ను రకుల్ ప్రీత్ సింగ్ కి రిఫర్ చేసింది. ఇదంతా “భలే మంచి రోజు, శమంతకమణి” చిత్రాల ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య త్వరలో నాగార్జున-నానిల కాంబినేషన్ లో తెరకెక్కించనున్న చిత్రం కోసం. ఈ ఇద్దరు హీరోయిన్లు పాటిస్తున్న స్నేహబంధంలో సాగమైనా మిగతా హీరోయిన్లు ఫాలో అయితే బాగుంటుంది.