అలా చూస్తే.. కాజల్ కు ఇది గోల్డెన్ ఛాన్సే..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండేళ్ళ తరువాత ‘సాహో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ 2019 సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది. అయితే ఈసారి ప్రభాస్.. తన తదుపరి సినిమాతో కచ్చితంగా ప్రేక్షకులని అలరించాలని కొంత షూటింగ్ పూర్తయినప్పటికీ.. మళ్ళీ స్క్రిప్ట్ లో మార్పులు చెబుతున్నట్టు టాక్ నడుస్తుంది. ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) ను ఈ చిత్రం కోసం అనుకుంటున్నారట. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఈసారి మాత్రం ‘సాహో’ చిత్రానికి తీసుకున్నట్టు ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్ గా ఈ చిత్రాన్ని ఫినిష్ చెయ్యాలని ప్రభాస్ భావిస్తున్నాడట. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో.. కథ ప్రకారం మరో హీరోయిన్ కూడా కావాలట. దీంతో మొదట ఈ పాత్ర అనుష్క చేస్తుందని వార్తలు వచ్చాయి. తరువాత కాజల్ పేరు కూడా వినిపించినప్పటికీ అది కూడా రూమరే అయ్యుంటుందని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ అందుతోన్న తాజా సమాచారం ప్రకారం ఆ క్యారెక్టర్ కాజలే చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈమె పాత్ర సినిమాలో 15 నిముషాలు మాత్రమే ఉంటుందట. అలా చూసుకున్నా ఇది కాజల్ కు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కాజల్ చేతిలో పెద్దగా అవకాశాలు లేవు. అంతేకాకుండా గతంలో కాజల్… ప్రభాస్ కు జోడీగా నటించిన ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాలు సూపర్ హిట్లయ్యాయి.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus