ఓ వైపు టాలీవుడ్లో డ్రగ్స్ కేసు ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేస్తున్నవేళ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీ వద్ద డ్రగ్స్(గంజాయి) దొరకడం అందరినీ షాక్కు గురి చేసిన సంగతి తెలిసిందే. అతడు కాజల్ అగర్వాల్ మేనేజర్ కావడంతో ఆమెకు కూడా ఇందులో సంబంధం ఉందేమోననే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కాజల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. రోనీ అరెస్టు విషయం తెలిసి తాను షాక్ అయినట్లు, రోనీ వృత్తిపరంగా మాత్రమే తనకు తెలుసు అని, అతడి వ్యక్తిగత జీవితం గురించి తనకు తెలియదని కాజల్ స్పష్టం చేసింది.
రోనీ అరెస్టు విషయం తెలిసి మొదట నేను షాకయ్యాను. సమాజానికి హాని కలిగించే ఇలాంటి వారికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వను అని స్పష్టం చేశారు. నా వృత్తిపర పనుల్లో సహాయం చేసే వారిని నేను బాగా చూసుకుంటున్నంత మాత్రాన వారి వ్యక్తిగత జీవితం గురించి తనకు తెలుసు అనుకోవడం పొరపాటు అని కాజల్ అన్నారు. నా కెరీర్ విషయాలను ఎల్లప్పుడూ నా తల్లిదండ్రులే మేనేజ్ చేస్తుంటారు. ఇండస్ట్రీలో నాకు సహాయం చేసే వారందరితోనూ నేను కేవలం వృత్తిపరమైన స్నేహం మాత్రమే కొనసాగిస్తాను అని కాజల్ తెలిపారు. ఎవరితో అయినా సరే ఒక్కసారి వృత్తిపర అవసరాలు తీరిపోయాక వారి గురించి ఆలోచించడంగానీ, పట్టించుకోవడంగానీ నేను చేయను` అని కాజల్ తన ట్విట్టర్ పోస్టు ద్వారా తెలిపింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.