కాజల్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్టే.. ట్వీట్ తో తేల్చేసింది..!

అక్టోబర్ 30న తన స్నేహితుడు మరియు ప్రముఖ బిజినెస్మెన్ అయిన గౌతమ్‌ కిచ్లును పెళ్ళాడింది కాజల్ అగర్వాల్. అయితే పెళ్ళైన కొద్దిరోజులకే ‘ఆచార్య’ షూటింగ్ లో ఆమె తిరిగి జాయిన్ అవ్వబోతున్నట్టు కాజల్ అండ్ టీం తెలియజేసింది. దాంతో మునుపటిలానే కాజల్ తన సినిమా కెరీర్ ను కొనసాగిస్తుందిలే అని ఆమె అభిమానులు సంతోషపడ్డారు. కానీ ప్రస్తుతం ఆమె సైన్ చేసిన సినిమాల షూటింగ్ లను మాత్రమే త్వరగా ఫినిష్ చెయ్యాలని భావిస్తున్నట్టు తాజా సమాచారం.

ఈ విషయాన్ని కాజల్ నేరుగా చెప్పకపోయినా.. ఇండైరెక్ట్ గా తన ఫీలింగ్స్ ను ట్విట్టర్ ద్వారా తెలియజేసినట్టు స్పష్టమవుతుంది. ”నిజానికి ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. నేను ఈ పని ఎప్పుడో చెయ్యాల్సింది. ఇప్పుడు ఓ లెటర్ ద్వారా తెలియజేస్తున్నందుకు నన్ను క్షమించండి. ఇంత కంటే సున్నితమైన మార్గం .. నాకు తెలియడం లేదు. ఎప్పుడో బాధపడటం కంటే ఇప్పుడే అసలు విషయం చెప్పి సిద్ధపరచడం బెటర్ అని నాకు అనిపిస్తుంది.

ఓ చిన్న వైరస్ ప్రపంచాన్ని ఇంతలా కుదిపేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. కంటికి కనిపించని శత్రువు ఇంతలా భయపెడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. జీవితం గురించి నన్ను నేను మార్చుకునేలా చేసింది. అవును ఇప్పుడున్న నా లైఫ్‌స్టైల్‌ని పూర్తిగా మార్చుకోవాలనుకుంటున్నాను. క్షేమంగా ఉండడం కోసం ఎంతటి కఠిన నిర్ణయానికైనా నేను రెడీగా ఉన్నాను” అంటూ ట్వీట్లో పేర్కొంది కాజల్. దీనిని బట్టి ‘క్షేమంగా ఉండడానికి సినిమాలకు గుడ్ బై చెప్పక తప్పడం లేదు’ అనేది కాజల్ ముఖ్య ఉద్దేశం కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26


Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus