‘షి సెడ్ యస్’ అని మిహీకాతో ఉన్న ఫోటోను రానా పోస్ట్ చేశాడు. తన పెళ్లి ప్రతిపాదనకి ఆమె అంగీకరించిందని అలా చెప్పాడన్నమాట. రానా స్టైల్ లోనే కాజల్ అగర్వాల్ కూడా తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక్కడ పెళ్లికి ‘యస్’ చెప్పింది కాజల్ కావడం విశేషం. ‘ఐ సెడ్ యస్’ అని కాజల్ అఫీషియల్ గా తన పెళ్లి న్యూస్ కన్ఫర్మ్ చేసింది. “గౌతమ్ కిచ్లూతో నేను వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్న అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అక్టోబర్ 30న ముంబయ్ లో మా ఇద్దరి కుటుంబాలు, బంధువుల సమక్షంలో పెళ్లి వేడుక చిన్నగా జరుగుతుంది.” అని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు.
పెళ్లి తర్వాత కూడా సినిమాలలో యాక్ట్ చేస్తానని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తానని అన్నారు. తనకు మద్దతు ఇస్తున్న వాళ్ళు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కాజల్ కి కాబోయే భర్త ముంబైలో ఉంటారు. అతడికి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఉంది. ఈ నేపధ్యంలో కాజల్, గౌతమ్ కిచ్లూ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :