కాజల్ నిర్మాతగా మారడం వెనుక.. ఓ క్రేజీ హీరోయిన్ హస్తం..?

టాలీవుడ్ లో ఇప్పటికీ అగ్రతారలలో ఒకరిగా కొనసాగుతుంది కాజల్ అగర్వాల్. కాజల్ హీరోయిన్ గా నటిస్తుందంటే.. ఆ చిత్రానికి మంచి క్రేజ్ నెలకొంటుందనడంలో సందేహం లేదు. దాదాపు 10 ఏళ్ళ తరువాత రీ ఎంట్రీ ఇవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి సైతం కాజల్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారంటే.. హీరోయిన్లలో కాజల్ ప్రత్యేకతని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి కుర్ర హీరోయిన్ల దాటికి తట్టుకుంటూ స్టార్ ఇమేజ్ ని కాపాడుకుంటుంది కాజల్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో కూడా కాజల్ నటించబోతుందనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ డైరెక్షన్లో వస్తున్న ‘సీత’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది కాజల్. ఇదిలా ఉంటే.. త్వరలోనే కాజల్ నిర్మాతగా మారబోతుందనే వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది.

వివరాల్లోకి వెళితే ‘కే.ఏ. మూవీస్’ అనే బ్యానర్ ని స్థాపించి సొంతగా సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో కాజల్ ఉందట. ఇందులో భాగంగా మొదటి చిత్రాన్ని ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో నిర్మించబోతుందట. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే.. కాజల్ బ్యానర్ లో ఓ స్లీపింగ్ పార్టనర్ కూడా ఉండబోతుందట. ఆ పార్టనర్ మరెవరో కాదు.. మన మిల్కీ బ్యూటీ తమన్నా. కాజల్ – తమన్నా మంచి స్నేహితులని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం తమన్నా కూడా సీనియర్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల వెంకటేష్ సరసన ‘ఎఫ్2’ చిత్రంలో వెంకటేష్ సరసన నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక మెగాస్టార్ ‘సైరా’ చిత్రంలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఇప్పటివరకు స్నేహితులుగా ‘కాజల్- తమన్నా’ ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ గా కూడా మారబోతున్నారన్న మాట. త్వరలోనే తన బ్యానర్ కి సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ‘అ!’ చిత్ర సమయంలో కాజల్.. ప్రశాంత్ వర్మ కి మధ్య ఓ కథకు సంబంధించిన చర్చలు జరిగాయట. ఈ క్రమంలో కాజల్ తనే సొంతంగా నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోందని తెలుస్తుంది. ఈ చిత్రంలో కాజల్ కూడా నటిస్తుందట. అయితే తమన్నా కూడా ఈ చిత్రంలో నటిస్తుందా..? అసలు ఈ చిత్రం తరువాత ఈ బ్యానర్ ని కొనసాగుతారా లేక ఒక చిత్రంతోనే ఆపేస్తారా… ? అనేది తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus