పెళ్లి తరువాత కూడా కాజల్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేది లేదట..!

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కాజల్ అగర్వాల్. దశాబ్దకాలం పై నుండే ఈమె టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఈమె డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఓ పక్క కుర్ర హీరోల సినిమాల్లోనూ మరో పక్క సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లోనూ నటిస్తూ ఇప్పటికీ బిజీగానే గడుపుతుంది కాజల్. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా.. ముంబైకు చెందిన బిజినెస్మెన్ గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చింది కాజల్.

అక్టోబర్ 30న(నిన్న) సాయంత్రం కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకూ బిజినెస్మెన్లను పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్లు.. సినిమాల్లో నటించిన దాఖలాలు లేవు. ఇప్పుడు కాజల్ కూడా బిజినెస్మెన్ నే పెళ్లి చేసుకుంటుంది కాబట్టి… కాజల్ కూడా సినిమాలకు దూరమైపోయినట్టే అనే వార్తలు వచ్చాయి. అయితే కాజల్ మాత్రం పెళ్లైన వెంటనే సినిమా షూటింగ్లకు హాజరుకావడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

పెళ్ళైనప్పటికీ ఎక్కువ గ్యాప్ తీసుకుని హనీమూన్ కు వెళ్ళే ఆలోచన కాజల్ కు లేదట. కరోనా నేపథ్యంలో అది చాలా రిస్క్ అని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తుంది. నవంబర్ 10 నుండీ హైదరాబాదులో జరుగబోతున్న ‘ఆచార్య’ షూటింగ్లో జాయిన్ అవుతానని కాజల్ దర్శక నిర్మాతలకు చెప్పిందట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus