Kajal, Chiranjeevi: కాజల్ వల్లే ఆచార్య మూవీ హిట్ కానుందా?

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గర్భవతి కావడంతో ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు. కాజల్ చిరంజీవికి జోడీగా నటించిన ఆచార్య మూవీ ఏప్రిల్ నెల 1వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది మే నెలలో విడుదల కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఒక సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా హిట్టేనని కాజల్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. కాజల్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమాలలో 4 సినిమాలు ఏప్రిల్ నెలలో విడుదలయ్యాయి. ఈ నాలుగు సినిమాలలో మూడు సినిమాలు సక్సెస్ సాధించగా ఒక సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. 2010 సంవత్సరంలో ఏప్రిల్ లో విడుదలైన డార్లింగ్ సినిమాతో కాజల్ అగర్వాల్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

2011 సంవత్సరంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో కాజల్ అగర్వాల్ మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బాద్ షా సినిమాతో కాజల్ ఖాతాలో మరో సక్సెస్ చేరింది. అయితే ఏప్రిల్ నెలలో కాజల్ నటించి విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా మాత్రం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ఆచార్యకు కాజల్ సెంటిమెంట్ కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

మరోవైపు దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఒక్క సినిమా కూడా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోలేదు. ఆచార్య సినిమాపై అభిమానుల నమ్మకం నిజమవుతుందో లేదో తెలియాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే. చిరంజీవి, చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటించిన సినిమాలలో ఆచార్య సినిమా ఒకటి కావడం గమనార్హం. చరణ్ ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో కనిపించనున్నారు. దేవాలయాల భూములకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus