గౌతమ్ కంటే నేనే రొమాంటిక్ : కాజల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల తను ప్రేమించిన గౌతమ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన లవ్ స్టోరీ గురించి మాట్లాడింది ఈ బ్యూటీ. ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదాపు అన్ని విషయాలను బయటపెట్టింది కాజల్. గౌతమ్ తో మూడేళ్లుగా ప్రేమలోఉన్నానని .. అంతకంటే ముందు ఏడేళ్లుగా తనతో పరిచయం ఉందని చెప్పుకొచ్చింది. కానీ కరోనా కారణంగా ఎడబాటు తప్పలేదని.. దీంతో మాస్క్ లు వేసుకొని బయట షాపుల వద్ద కలుసుకునేవాళ్లమని చెప్పింది.

అప్పుడే ఒకరినొకరు విడిచి ఉండలేమనే విషయం అర్థమైందని.. వెంటనే ఇంట్లో చెప్పేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. ఇక డేటింగ్ విషయానికొస్తే.. గౌతమ్ కంటే తనే ఎక్కువ రొమాంటిక్ అంటోంది కాజల్. రొమాన్స్ విషయంలో గౌతమ్ కాస్త తక్కువే అని చెప్పింది. అతడికి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేదని.. అదే తన విషయానికొస్తే.. రొమాన్స్ విషయంలో చాలా అనుభవం ఉందని చెప్పింది. సినిమాలు తనకు కావాల్సినంత రొమాన్స్ ను నేర్పించాయని..

కాబట్టి గౌతమ్ కంటే తనే ఎక్కువ రొమాంటిక్ గా ఉంటానని చెప్పుకొచ్చింది. నిజానికి కాజల్-గౌతమ్ లు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకున్నారు. ఆ తరువాత నాసిక్ వెళ్లి అక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ ఫైనల్ గా కాజల్ ఇంటి దగ్గర్లో ఉన్న తాజ్ మహాల్ ప్యాలెస్ హోటల్ లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26


Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus