Kajal: చరణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన కాజల్!

కాజల్ అగర్వాల్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో అగ్ర హీరోలందరి సరసన నటించిన్ మెప్పించిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో దాదాపు రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

మగధీర వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే సెన్సేషనల్ హిట్ అందుకుంది. అదేవిధంగా గోవిందుడు అందరివాడేలో కూడా కాజల్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి సందడి చేశారు. ఇలా రామ్ చరణ్ తో సినిమాలలో నటించినటువంటి ఈమె ఏకంగా రామ్ చరణ్ చంపేయాలి అంటూ మాట్లాడటంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలా కాజల్ అగర్వాల్ (Kajal)  రామ్ చరణ్ ను చంపేయాలనుకున్నంత కోపం ఎందుకు వచ్చింది ఏంటి అనే విషయానికొస్తే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు రాపిడ్ ఫెయిర్ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందులో భాగంగా టాలీవుడ్ హీరోల గురించి పలు ప్రశ్నలు వచ్చాయి. ఈ క్రమంలోనే మీకు ఛాన్స్ వస్తే ఏ హీరోని చంపేస్తారు ఎవరితో లేచిపోతారు, ఏ హీరోని పెళ్లి చేసుకుంటారు అంటూ రాపిడ్ ఫెయిర్ ప్రశ్నలు అడగడంతో ఈమె ఆసక్తికరమైన సమాధానాలు తెలిపారు.

ఈ ప్రశ్నలకు కాజల్ సమాధానం చెబుతూ తాను ఎన్టీఆర్ తో లేచిపోయి ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని తెలిపారు. అదే విధంగా అవకాశం వస్తే రాంచరణ్ తాను చంపేస్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అయితే ఈ ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పినప్పటికీ రాంచరణ్ అభిమానులు మాత్రం కాజల్ చేసిన వ్యాఖ్యలపై కాస్త కోపంతో ఉన్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus