కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటో పెట్టినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతుంది ఇక ఇటీవల ఇంస్టాగ్రామ్ స్టోరీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అని చెబుతూ కాస్త వేచి ఉండాలి అనేలా లవ్ సింబల్ తో పాటు డ్యాన్స్ ఏమోజీని కూడా జత చేసింది. కాజల్ అలా సడన్ గా అలాంటి పోస్ట్ చేయడంతో అంత ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏమై ఉంటుందని సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అని చెప్పిన చాలా మంది ఊహించని వార్తలతో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక కాజల్ లవ్ సింబల్ పెట్టింది కాబట్టి ఎదో గుడ్ న్యూస్ అయ్యి ఉంటుందని అనిపిస్తోంది. ఇక గతంలో అయితే ఆమె ప్రెగ్నెంట్ అని చాలా రకాల రునర్స్ వచ్చాయి. మరి ఆ రూట్లో ఏమైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి. అలాగే కాజల్ ఒక విభిన్నమైన ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయనుంది.
బహుశా ఆ విషయంలో ఏదైనా క్లారిటీ ఇవ్వడానికి ఇలా పోస్ట్ చేసిందా అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి కాజల్ ఎలాంటి సర్ ప్రైజ్ ప్లాన్ చేసిందో చూడాలి. ఇక ఈ బ్యూటీ నటించిన తదుపరి తెలుగు సినిమా ఆచార్య విడుదలకు సిద్ధమవుతోంది.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!