హీరో కమల్ హాసన్ సరసన ఛాన్స్ కొట్టేసిన కాజల్ అగర్వాల్

  • December 4, 2018 / 12:24 PM IST

కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ్ లో నటిస్తూ తనకంటూ ఒక క్రేజ్ ని తెచ్చుకొని టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉంది. దాదాపుగా స్టార్ హీరోల అందరితో నటించిన ఈ ముద్దుగుమ్మకు మరొక క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా అవకాశం వచ్చిందనే వార్త వినిపిస్తుంది. ఇక డైరెక్టర్ శంకర్, హీరో కమల్ హాసన్ కాంబినేషన్ లో భారతీయుడు సినిమాకి సిక్వెల్ ఉంటుందని తెలిసిందే. డైరెక్టర్ శంకర్ ‘2.ఓ’ మంచి టాక్ తెచ్చుకుంటుండగా ఇదే ఊపులో పూజాకార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఇండియన్ – 2’ సినిమా షూటింగ్ ని త్వరలోనే మొదలు కానుందట.

అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కాజల్ హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు గతంలో వినిపించినప్పటికీ, ఇటీవలే సినీ విశ్లేషకుడు రమేష్ బాలా, డైరెక్టర్ శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఇండియన్ – 2’ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని ట్వీట్ చేసాడు. అయితే ఈ సినిమాలో ఒక కొత్త లుక్ లో కాజల్ కనిపిస్తుందని, ఈ లుక్ కోసం అమెరికా నుండి ఒక బృందం రానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజమైతే కమల్, కాజల్ కాంబినేషన్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వడం గ్యారెంటీ అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus