కాజల్ సమంత నడుమ ఆసక్తికరమైన పోటీ

హీరోయిన్ల నడుమ అందంగా కనిపించడం, కాస్ట్యూమ్స్ ఇంకా చెప్పాలంటే సినిమాల కౌంట్ & హీరోల విషయంలో పోటీ నెలకొనడం అనేది సర్వసాధారణం. కానీ.. సమంత, కాజల్ నడుమ మాత్రం ఒక విచిత్రమైన పోటీ నడుస్తోంది. అదే ఆన్లైన్ వార్. ఈ ఇద్దరు కథానాయికలు ఆన్లైన్ లో యమ యాక్టివ్ గా ఉంటారు. అయితే.. ఎంత యాక్టివ్ గా ఉన్నా ట్విట్టర్ లో సమంతదే అప్పర్ హ్యాండ్. అందుకు కారణం ఆమె అప్పుడప్పుడూ అభిమానులకి కూడా రిప్లైస్ ఇస్తుంది. ఆమె ఇచ్చే రిప్లైస్ కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ.. కాజల్ మాత్రం తన ఫోటోలు షేర్ చేయడం, స్నేహితులకు విషేస్ చెప్పడం, తన సినిమాలను ప్రమోట్ చేయడానికి తప్ప ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కోసం అస్సలు వాడదు.

అందువల్ల సమంతకు ట్విట్టర్ లో ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ కాజల్ కి లేదు. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో కాజల్ ది రైజింగ్ హ్యాండ్. అమ్మడు సీనియర్ హీరోయిన్ కావడంతో సమంతకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. దాంతో ఈ ఇద్దరు ఒకరితో ఒకరు పోటీగా ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఫాలోవర్స్ కోసం పోటీ పడుతున్నారు. ఈ పోటీ పుణ్యమా అని అభిమానులు మాత్రం వాళ్ళు గ్యాప్ లేకుండా పెట్టే ఫోటోలు చూస్తూ పండగ చేసుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus