Sarkaru Vaari Paata: ‘కళావతి’ పాట.. ముందే లీకైపోయింది!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘సర్కారు వారి పాట’. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది కానీ వాయిదా పడింది. ఫైనల్ గా మే 12న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటినుంచే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో సినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Click Here To Watch

ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి. ఆ పాత్ర పేరు మీదుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతోందని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇది కచ్చితంగా మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది. తమన్ స్వరపరిచిన ఈ పాటతో అందరూ ప్రేమలో పడనున్నారని యూనిట్ బాగా ప్రమోట్ చేసింది. నిన్ననే ఈ పాట ప్రోమోను వదిలారు. అందులో మహేష్ బాబు, కీర్తి సురేష్ ఫారెన్ స్ట్రీట్స్ లో నడుస్తూ కనిపించారు.

పాటను చాలా స్టైలిష్ గా ప్లాన్ చేశారనిపించింది. అయితే ఇప్పుడు ‘కళావతి’ పూర్తి పాట లీకైపోయింది. మేకర్స్ రిలీజ్ చేయడం కంటే ముందే ఈ పాట బయటకు రావడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సింగర్ సిద్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇద్దరూ కలిసి ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని కనిపించారు. మధ్యమధ్యలో మహేష్ బాబు, కీర్తి సురేష్ కనిపించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్‌పై సినిమాను నిర్మిస్తున్నారు.

ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇందులో హీరో కుటుంబ స‌భ్యుల‌ను, బ్యాంకుల‌ను మోసం చేసేసి విల‌న్ విదేశాల‌కు పారిపోతాడు. ఆ విల‌న్‌ను హీరో ఇండియాకు ర‌ప్పించి త‌న ప‌గ‌, ప్ర‌తీకారాన్ని ఎలా తీర్చుకున్నాడనేదే కథ అని టాక్.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus