Kalaavathi Song: ‘సర్కారు వారి పాట’ : ‘కళావతి’ సాంగ్ ప్రోమో వైరల్..!

అన్నీ అనుకున్నట్టు జరిగి ఉండుంటే ఈ సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’ మూవీ రిలీజ్ అయ్యి ఉండేది.కానీ పలు కారణాల వల్ల ఆ మూవీ విడుదల కాలేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తర్వాత మహేష్ బాబు రాబోతున్న మూవీ ఇదే..! కాబట్టి అంచనాలు భారీగా నెలకొన్నాయి. పరశురామ్(బుజ్జి) దర్శకుడు కాగా ’14 రీల్స్ ప్లస్’ వారితో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Click Here To Watch

మే 12న ఈ చిత్రం విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించారు. ప్రమోషన్స్ ను మాత్రం మూడు నెలల ముందు నుండే ప్రారంభించారు. మొదటి పాట అయిన ‘కళావతి’ని వాలెంటైన్స్ డే కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ పాటకి సంబంధించి వరుస అప్డేట్లు ఇస్తూ వస్తున్నారు ‘సర్కారు వారి పాట’ టీం. ఈ క్రమంలో ‘కళావతి’ పాటకి సంబంధించిన ప్రోమోని కూడా విడుదల చేశారు. ‘వందో ఒక వెయ్యో.. ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా..

ఏందే ఈ మాయ, కిందో ఇటు పక్కో అటు దిక్కో చిలిపిగ తీగల మొగినాయ’ అంటూ ఈ ప్రోమోలో లిరిక్స్ ఉన్నాయి. తమన్ అందించిన బీట్ కాస్తా.. ‘ఆగడు’ లో సరోజ పాటకు సిమిలర్ గా అనిపిస్తుంది. ఇక మహేష్ బాబు కీర్తి సురేష్ వెనుక నడిచి రావడం.. సిగ్గుతో గోడ మీద పడడం’ వంటివి ‘పోకిరి’ లో ‘నొప్పి నొప్పి’ పాటని గుర్తుచేస్తున్నాయి.

అయితే మహేష్ లుక్ మాత్రం చాలా బాగుంది. అతని పక్కన హీరోయిన్ కీర్తి సురేష్ తేలిపోయింది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. మీరు కూడా ఈ ప్రోమోని ఓ లుక్కేయండి :

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!


బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus