మలయాళ సినిమాలో కాలకేయుడు

  • September 19, 2016 / 07:26 AM IST

తెలుగు సినిమాల్లో పరభాషా నటుల సంఖ్య ఎక్కువగా ఉందని కొంతకలాంగా పరిశ్రమలో వినవస్తోన్న సంగతి తెల్సిందే. వారు మన దగ్గర పొందే అవకాశాలతో పోలిస్తే మనకి అక్కడ ఆ రీతిన అవకాశాలు రావటం లేదన్నది మనవారి ఆవేదన. కోట శ్రీనివాసరావు లాంటి ఒకరిద్దరు ఇందుకు మినహాయింపు కాగా మునుపటితో పోలిస్తే ఇప్పుడు తెలుగు వారికి ఇతర పరిశ్రమల్లో అవకాశాలు వస్తున్నాయి. జగపతి బాబు వంటి వారు ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తుండగా తాజాగా మరో నటుడు ఆ అవకాశాన్ని దక్కించుకున్నాడు.

తొలి సినిమా “మర్యాద రామన్న” సినిమాతోనే అందరినీ మెప్పించిన ప్రభాకర్ ఓ మలయాళ సినిమాలో నటిచనున్నారు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ కలయికలో బి. ఉన్ని కృష్ణన్ ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో ఓ ముఖ్య పాత్రకు ప్రభాకర్ ని ఎంపిక చేశారట. తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాకర్ ‘బాహుబలి’ సినిమాలో కాలకేయుడిగా ప్రపంచానికి పరిచయమయ్యాడు. ఈ అవకాశమూ బాహుబలి చలవే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus