మార్చి నెల పూర్తి కావస్తోంది. ఈ చివరి వారంలో పదుల సంఖ్యలో కొన్ని సినిమాలు రిలీజ్ కావస్తోంది. అయితే ఈ లిస్ట్ లో ‘కలియుగం పట్టణంలో’ అనే చిన్న సినిమా కూడా ఉంది. టైటిల్ తో పాటు టీజర్, ట్రైలర్స్ కొత్తగా అనిపించాయి. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :
కథ: నంద్యాలకు చెందిన విజయ్ ( విశ్వ కార్తికేయ), సాగర్ ( విశ్వ కార్తికేయ) కవల పిల్లలు. విజయ్ రక్తం చూసి భయపడే రకం. కానీ సాగర్ మాత్రం రక్తం చూసి ఆనందపడే సైకో లాంటి వ్యక్తి. సాగర్ ప్రవర్తన తన తల్లిదండ్రులు మోహన్ (దేవీ ప్రసాద్), కల్పన (రూప లక్ష్మి) లకి ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. సాగర్ వల్ల ఎన్ని అనర్ధాలు తలెత్తుతాయా అని వారు భయాందోళనకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా విజయ్ కి సాగర్ ఎలాంటి హాని తలపెడతాడా? అనే భయం కూడా వారిలో ఏర్పడుతుంది. అందుకే సాగర్ ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు అతని తల్లిదండ్రులు.
అటు తర్వాత విజయ్ కాలేజీలో చేరతాడు.అతను మంచోడు కాబట్టి శ్రావణి (ఆయుషి పటేల్) అతన్ని ఇష్టపడుతుంది. మరోపక్క నంద్యాలలో కొన్ని సీరియల్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ కేసులను సాల్వ్ చేసేందుకు పోలీస్ అధికారి (చిత్రా శుక్లా) ఆ ఊరికి వస్తుంది. ఆ ఊరిలో జరుగుతున్న దారుణాలకు సాగర్, విజయ్..లకి సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: హీరో విశ్వ కార్తికేయ విజయ్, సాగర్ వంటి డబుల్ షేడ్స్ కలిగిన పాత్రల్లో బాగా నటించాడు. 2 పాత్రలకి డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి మంచి మార్కులు వేయించుకున్నాడు అని చెప్పాలి. ఆయుషి పటేల్ గ్లామర్ తో అమితంగా ఆకట్టుకుంటుంది. ఆమె లుక్స్ వావ్ అనిపించే విధంగా ఉన్నాయి. ఈమెకు పెద్ద సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక పోలీస్ పాత్ర చేసిన చిత్రా శుక్లా తన మార్క్ నటనతో మెప్పించింది. అలాగే సీనియర్ నటులు దేవీ ప్రసాద్, రూప లక్ష్మి, అనీష్ కురువిల్ల వంటి వారు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు అని చెప్పొచ్చు.
సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఎంపిక చేసుకున్న పాయింట్ కొత్తగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఫాస్ట్ గా కంప్లీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.అయితే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా సాగుతుంది.అలాగే వయొలెన్స్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. ఫైనల్ గా కన్విన్సింగ్ గా అనిపించే ఛాన్సులు ఉన్నాయి. దర్శకుడు స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకున్నాడు. నెగిటివ్ రోల్ ఎవరిది అనేది ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యాక చెప్పడం కష్టం. కొన్ని సినిమాల్లో మనం ముందే కనిపెట్టే ప్రయత్నాలు చేయొచ్చు.
60 శాతం కరెక్ట్ గా గెస్ చేసే ఛాన్సులు కూడా ఉంటాయి. కానీ ఈ సినిమా విషయంలో డైరెక్టర్ చాలా జాగ్రత్త పడ్డాడు. ఇలాంటి సినిమాలకి నేపధ్య సంగీతం. సినిమాటోగ్రఫీ ఆయువుపట్టుగా నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఓకే అనిపిస్తుంది.
విశ్లేషణ: ‘కలియుగం పట్టణంలో’ డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. టార్గెటెడ్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వీకెండ్ ఒకసారి ట్రై చేయదగ్గ సినిమా.
రేటింగ్ : 2.5/5