Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

  • June 12, 2024 / 05:25 PM IST

ప్రభాస్ (Prabhas)  నాగ్ అశ్విన్  (Nag Ashwin)  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి (Kalki 2898 AD)  సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కల్కి ట్రైలర్ అన్ని భాషల్లో పాజిటివ్ ఒపీనియన్ ను సొంతం చేసుకుంది. చిన్న చిన్న మైనస్ లు ఉన్నా ఆ మైనస్ లు సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపే అవకాశాలు అయితే తక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కల్కి ట్రైలర్ లో యాక్షన్ షాట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండగా కమల్ హాసన్ లుక్ ఊహించని విధంగా ఉంది. అయితే ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ కూడా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఫస్ట్ ట్రైలర్ ను మించి సెకండ్ ట్రైలర్ ఉంటుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని భోగట్టా. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉండనుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్స్ కు ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి సినిమా రిలీజ్ సమయానికి ఆకాశమే హద్దుగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కల్కి సినిమాపై ప్రభాస్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకోగా ఆ ఆశలను నిజం చేసే విధంగా ఈ సినిమా ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కల్కి మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఫస్ట్ పార్ట్ ను మించి కల్కి2 ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాతో ప్రభాస్ మార్కెట్ కు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ వస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి విడుదలైన తర్వాత ప్రభాస్ మరికొన్ని ప్రాజెక్ట్ లను ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. కల్కి సినిమా ఏ సెంటర్స్ లో మాత్రం కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus