Kalki: అన్నీ ఓకే.. కొన్ని చెక్‌ చేసుకోవాలి నాగీ.. అర్థమవుతోందిగా అవేంటో?

‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనే ఊహాగానాలు మాని.. ట్రైలర్‌ భలే ఉంది, సినిమా ఇంకా బాగుంటుంది అనే మాటల రోజుల్లోకి వచ్చేశాం. సినిమా విడుదలకు గట్టిగా రెండు వారాలు లేని నేపథ్యంలో చిత్రబృందం ప్రచారం జోరును పెంచింది. ఈ క్రమంలోనే ఫస్ట్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. అదేంటి ఫస్ట్‌ అనుకుంటున్నారా? వార్త ఆఖరులో ఆ విషయం గురించి చెబుతాం లెండి. ఇక అసలు విషయానికొస్తే సినిమా ట్రైలర్‌ అదిరిపోయింది.

హాలీవుడ్‌ స్థాయికి మించి ఉంది అనే మాట అన్నా అతిశయోక్తి కాదు కూడా. విజువల్స్‌, చూపించిన విధానం, కంటెంట్‌ అన్నీ అదిరిపోయాయి. అయితే కాస్త నిరూత్సాహ పరిచే ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి. వాటినే ఇప్పుడు చెప్పబోతున్నాం. ఏవైనా ఇబ్బందులు చెబితే సరిదిద్దుకొని, భలే అనిపించే కంటెంట్‌ ఇవ్వడం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) స్టైల్‌. ఇప్పుడు కూడా అదే చేస్తారని ఆశిస్తున్నాం. నాగ్ అశ్విన్ ఊహలు, వాటిని కథగా రాసుకున్న విధానం, దానిని చిత్రీకరించిన విధానం బాగుంది.

కానీ ట్రైలర్‌ ఓవర్‌ స్టఫ్‌డ్‌ అనిపిస్తుంది. ఎక్కువ ఎలిమెంట్స్‌ చూపించే క్రమంలో ఏదో ఫీల్‌ మిస్ అయింది. అయితే సూపర్‌ హీరోల సినిమాల్లాగే ఇది కొంతమందికి మాత్రమే అనే ఫీల్‌ కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభాస్‌ (Prabhas) లాంటి స్ట్రాంగ్‌ పాత్రను కాస్త కామిక్‌గా చూపిండమే ఈ మాటకు కారణం. సినిమా నేపథ్య సంగీతం విషయంలో పెద్దగా కంప్లైంట్స్‌ లేవు. అయితే విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో నిరాశ మాత్రం ఉంది. కొన్నిచోట్ల అసంపూర్తి మిక్సింగ్‌లా అనిపిస్తోంది.

అయితే ఫైనల్‌ ఎడిట్‌లో సరి చేయొచ్చు. ఇక మరో సమస్య డబ్బింగ్‌. అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) , దీపిక పడుకొణె (Deepika Padukone) డబ్బింగ్‌ ఎబ్బెట్టుగగా ఉంది. మరి సినిమాలో ఇదే వాయిస్‌ ఉంచుతారా? లేక వేరే డబ్బింగ్‌ చెప్పిస్తారా? అనేది చూడాలి. ఇక పైన చెప్పిన ‘ఫస్ట్‌’ సంగతి చూద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే.. సినిమాకు రెండో ట్రైలర్‌ కూడా ఉందట. సినిమా రిలీజ్‌కు ముందు రిలీజ్‌ ట్రైలర్‌ అని తీసుకొస్తారట. అందులో అంతా ప్రభాస్‌ మీదనే నడుస్తుందట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus