శ్రీజ కొణిదెల.. ఈమె అందరికీ సుపరిచితమే. చిరంజీవి చిన్న కూతురిగా.. నటుడు కళ్యాణ్ దేవ్ భార్యగా ఈమె బాగా ఫేమస్. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా శ్రీజ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన పిల్లల ఫోటోలను, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను, అనుభవాలను ఈమె షేర్ చేస్తూ ఉంటుంది. తన ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా టూర్లకు వెళ్లి అక్కడ తీసుకునే ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
ఇన్స్టాగ్రామ్లో ఈమెకు 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ సంఖ్య ఉంది. ఈరోజు శ్రీజ పుట్టినరోజు కావడంతో ఈమె ఫాలోవర్స్ పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. రామ్ చరణ్ కూడా తన సోదరికి.. ‘టు ది స్ట్రాంగెస్ట్ లేడీ ఇన్ మై హౌస్… హ్యాపీ బర్త్ డే’ అంటూ శ్రీజ కొణిదెలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఆమె భర్త కళ్యాణ్ దేవ్ మాత్రం ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపలేదు.
కానీ అతను ఓ పోస్ట్ పెట్టి హాట్ టాపిక్ అయ్యాడు. ‘లైఫ్ అంత ఈజీగా సాగదు’ అంటూ రాసుకొచ్చి తన పర్సనల్ ఫోటోని షేర్ చేశాడు. ఈ పోస్ట్ కు కొంతమంది శ్రీజకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిజానికి చాలా కాలంగా శ్రీజ- కళ్యాణ్ దేవ్ లు విడిగా ఉంటున్నారు అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. కళ్యాణ్ దేవ్ పోస్ట్ వల్ల ఈ వార్తలకు ఇంకా బలం చేకూరే అవకాశాలు ఉన్నాయి.
Most Recommended Video
లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!