కళ్యాణ్ దేవ్.. మెగాస్టార్ చిరంజీవి గారి చిన్నల్లుడు గా ప్రేక్షకులందరికీ బాగా పరిచయం. రెండు, మూడు సినిమాల్లో కూడా హీరోగా నటించాడు అందులో ఓటీటీలో రిలీజ్ అయిన ‘కిన్నెరసాని’ తప్ప విజయం సాధించిన సినిమాలు ఏమీ లేవు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా కళ్యాణ్ దేవ్ పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి కానీ.. వాటిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా కళ్యాణ్ దేవ్ తన తల్లి గురించి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
ఆ పోస్ట్ ను గమనిస్తే.. ” హ్యాపీ బర్త్ డే అమ్మ.. కొన్నిసార్లు ఊహించని విధంగా జీవితంలో కష్టాలు వచ్చి పడతాయి. అయినా సరే నీ ప్రేమ వల్ల… నాకు ఏ కష్టం వచ్చినా దాన్ని అధిగమించగలగుతున్నాను. నా కోసం ఎల్లప్పుడూ ఉంటున్నందుకు థాంక్యూ.. ‘లవ్ యు సో మచ్’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ తో ఆ పోస్ట్ పెట్టాడు. నిన్న కళ్యాణ్ దేవ్ తల్లి జ్యోతి గారి పుట్టినరోజు కావడంతో కళ్యాణ్ దేవ్ ఈ పోస్ట్ పెట్టాడు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ పోస్ట్ పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘జ్యోతి గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని కొందరు.. ‘మధర్ లవ్ ఈజ్ అన్ కండిషనల్’ అని మరికొందరు.. ‘నీకు వచ్చిన కష్టం ఏంటో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలు అందరికీ తెలుసులే’ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.