మెహరీన్ స్థానంలోకి వచ్చిన మరో ముద్దుగుమ్మ

గతేడాది “విజేత” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్. పేరుకే చిరంజీవి అల్లుడు, కానీ స్టార్ డైరెక్టర్స్ వెంట పడకుండా కొత్త దర్శకులకి అవకశాలు ఇస్తున్నాడు కళ్యాణ్ దేవ్. ఇక ఈ తరుణంలో కళ్యాణ్ దేవ్ తన తదుపరి సినిమాని పులి వాసు దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారట.

హిందీలో “హాఫ్ గర్ల్ ఫ్రెండ్, బ్యాంక్ చోర్, జలేబి” లాంటి సినిమాల్లో నటించింది రియా. అలాగే ఈ భామ తెలుగులో కూడా “తూనీగా తూనీగా” అనే సినిమా కూడా చేసింది. కానీ ఇప్పటి వరకు ఈ భామకి అటు బాలీవుడ్ లో గాని ఇటు టాలీవుడ్ లో గారి హీరోయిన్ గా సరైన గుర్తింపు దక్కలేదు. మరి ఇప్పుడు ఈ మెగా ఫ్యామిలీ ఆఫర్ తో అయిన ఈ అమ్మడు కెరీర్ పట్టలేక్కుతుందో లేదో చూడాలి. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి నుంచి షూటింగ్ కి వెళ్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus