మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడిగా సినిమాల పై ఉన్న ఇంట్రెస్ట్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్. ఈయన నటించిన మొదటి చిత్రం ‘విజేత’ కు మంచి టాక్ వచ్చినప్పటికీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే ఎలాగైనా హిట్టు కొట్టాలని ‘సూపర్ మచ్చి’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే.. మరో రెండు సినిమాలు చెయ్యడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు అన్న సంగతి తెలిసిందే.
తాజాగా మరో ప్రాజెక్ట్ కు కూడా ఓకే చెప్పేశాడట. నాగశౌర్యతో ‘అశ్వద్ధామ’ వంటి యావరేజ్ చిత్రాన్ని తెరకెక్కించిన రమణ్ తేజ వినిపించిన స్క్రిప్ట్ కు కళ్యాణ్ దేవ్ ఇంప్రెస్ అయిపోయాడట. వెంటనే ఆ ప్రాజెక్టు చెయ్యడానికి ఓకే చెప్పేసాడని సమాచారం. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ అధినేత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట.వరుస ప్రాజెక్టులు అయితే ఓకే చేస్తున్నాడు కానీ .. ఆ డైరెక్టర్లు అందరూ ప్రస్తుతం హిట్టు లేని వారే.
కళ్యాణ్ దేవ్… మెగా హీరో కాబట్టి చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటి సినిమా హిట్ అవ్వలేదు… కాబట్టి సేఫ్ సైడ్ కి ఒకటి రెండు హిట్లు ఉన్న డైరెక్టర్లతో సినిమాలు చేస్తే బెటర్ అని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.