అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ కురసాలా దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి’, ‘జీ స్టూడియోస్’ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. విడుదల చేసిన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.
ప్ర.మీ సినిమాల్లో గోదావరి జిల్లాల నేటివిటీ కనిపిస్తూ ఉంటుంది? ఇంతకీ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ?
జ.మా నేటివ్ వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన నిడదవోలు. కానీ మేము సెటిల్ అయ్యింది వైజాగ్ లో..! మా బ్రదర్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాకి చెందిన కాకినాడ, మారేడుమిల్లి కి కూడా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. మా నాన్నగారు కాంట్రాక్టర్ గా పనిచేసేవారు.
ప్ర.’సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి ఎక్కువ రీ షూట్లు చేసారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ‘బంగార్రాజు’ ని చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేశారు ఎలా?
జ. ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి మేము చేసింది రీ షూట్లు కాదు. సీన్ ఇంకా బెటర్ గా రావాలని తాపత్రయం…దాంతో పాటు ఇంకా సీన్లు యాడ్ చేస్తే బాగుణ్ణు అనే ఉద్దేశంతో షూటింగ్ చేసాం.రీషూట్లు అని కాదు.. దాని షూటింగ్ అప్పుడు.. ఎప్పుడూ సీన్ మార్చడం, స్క్రిప్ట్ మార్చడం కానీ జరగలేదు.తీసింది నచ్చక అని అసలే కాదు. ఓ ఫైట్ మాత్రం మైసూర్లో 5డేస్ షూట్ చేసాము, ఇంకో 2డేస్ ఇక్కడ గోల్కొండ టోన్స్ లో చేసాము. అది తప్ప ఎక్స్ట్రా షూట్ చేసింది ఏమీ లేదు. ఎందుకో ఆ టైములో అలాంటి వార్తలు వచ్చాయి. సినిమా స్టార్ట్ అయిన మొదటి 15 రోజుల్లోనే నేను మైసూర్ నుండీ వస్తుంటే ‘రీ షూట్ల వార్తలు మొదలయ్యాయి’ అని మా బ్రదర్ ఓ లింక్ పెట్టాడు. దానికి ఇంక మనం ఏమీ చేయలేము అని లైట్ తీసుకున్నాం.
ప్ర.’బంగార్రాజు’ … ‘సోగ్గాడు’ కి సీక్వెలా? ప్రీక్వెలా?
జ. సీక్వెలే… ప్రీక్వెల్ కాదు. రెండు సినిమాలను కలిపి చూస్తే 5 గంటలు అవుతుంది. సోగ్గాడే ఎక్కడ ఎండ్ అయ్యిందో.. ‘బంగార్రాజు’ అక్కడ నుండే మొదలవుతుంది.
ప్ర.నాగార్జున గారితో ఇన్నేళ్ళు ట్రావెల్ అవుతూ వచ్చారు.ఆయన్ని మొదట ఎలా అప్రోచ్ అయ్యారు?
జ. 2014లో నేను నాగార్జున గారికి ఓ కథ చెప్పాను. అది ఆయనకి అది నచ్చింది.నిజానికి ‘సోగ్గాడే చిన్న నాయన’ లైన్ నాది కాదు. రామ్ మోహన్ గారి పాయింట్ అది.’సోగ్గాడు’ కోసం ముందుగా వేరే దర్శకుడిని అనుకున్నారు. ఆల్రెడీ నేను నాగార్జున గారికి కథ వినిపించడం అది ఆయనకి నచ్చడంతో… ‘సోగ్గాడు’ కథని తెరకెక్కించే అవకాశాన్ని నాకు ఇచ్చారు. 2016లో సోగ్గాడే రిలీజ్ అయ్యింది. అప్పుడే దీనికి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ ని చేయాలని చెప్పారు. అయితే మధ్యలో చైతన్యతో ఓ సినిమా చేయడం జరిగింది.. అది కూడా నాగార్జున గారే నిర్మించారు. ఆయనకి నాకు మంచి అండర్స్టాండింగ్ ఉంది. మా మధ్య ఆ ర్యాపొ అలానే బిల్డ్ అయ్యింది.
ప్ర. ‘బంగార్రాజు’ లో చైతన్య పాత్ర ఎలా ఉంటుంది?
జ. బంగార్రాజు మనవడి పాత్రలో చైతూ కనిపిస్తారు. పెద్ద బంగార్రాజు ఎంత దర్జాగా ఉంటాడో.. చిన్న బంగార్రాజు కూడా అంతే దర్జాగా ఉంటాడు.
ప్ర.రాము(‘సోగ్గాడే చిన్ని నాయన’ లో చిన నాగార్జున), సీత(లావణ్య త్రిపాఠి) పాత్రలు ఈ సినిమాలో ఉంటాయా?
జ.రాము పాత్ర ఉంటుంది కానీ ఎక్కువ సేపు ఉండదు. లావణ్య త్రిపాఠి పాత్ర లేదు. ఆమె ఉంటే చైతన్యకి తల్లిగా కనిపించాల్సి ఉంటుంది. కథ ప్రకారం కూడా ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ లేదు కాబట్టి.. ఆమెను ఈ సినిమాకి తీసుకోలేదు.
ప్ర.ఈ చిత్రంలో కృతి శెట్టి పాత్ర ఎలా ఉండబోతుంది?
జ.ఆమె నాగలక్ష్మీ అనే పాత్రలో కనిపిస్తుంది.’నేను చాలా తెలివైనదాన్ని’ అనుకునే అమాయకురాలి పాత్ర ఆమెది. విలేజ్‌లో ఉండి… బీటెక్ చదివి తనలాంటి తెలివైన అమ్మాయిలు ఊర్లో లేరని భవిస్తూ ఉంటుంది.
ప్ర. రమ్య కృష్ణ గారి పాత్ర ఎలా ఉంటుంది?
జ. ‘సోగ్గాడే చిన్ని నాయన’ లో ఆమె పాత్ర ఎలా ఉంటుందో ‘బంగార్రాజు’ లో కూడా అలానే ఉంటుంది.
ప్ర. కృతి శెట్టి పాత్రకి ముందుగా వేరే హీరోయిన్ ను అనుకున్నారట.. నిజమేనా?
జ. నిజానికి ‘ఉప్పెన’ షూటింగ్ టైంలోనే కృతి శెట్టిని అనుకున్నాం. అప్పుడు ఆమె వేరే సినిమాతో బిజీగా ఉండడం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేమంటే స్టోరీ నెరేట్ చేయ లేదు. ఆ టైములో మేము రష్మిక మందన ని తీసుకుందాం అనుకున్నాం.ఆమెతో మాట్లాడదాం అనుకుంటున్నప్పుడు.. కరెక్ట్ గా అప్పుడే కృతి శెట్టి టీం మమ్మల్ని కాంటాక్ట్ చేసి డేట్స్ అడ్జస్ట్ చేస్తాం అని ముందుకొచ్చారు. అలా జరిగింది.
ప్ర.’బంగార్రాజు’ సినిమా కోసం ‘వెంకీ మామ’ ప్రాజెక్టుని డైరెక్ట్ చేసే ఛాన్స్ వదులుకున్నారట?
జ.నిజమే.. ‘వెంకీ మామ’ ని నేనే డైరెక్ట్ చెయ్యాలి.డిస్కషన్స్ కూడా జరిగాయి.’బంగార్రాజు’ కోసమే దానిని వదులుకున్నాను.
ప్ర.’బంగార్రాజు’ లో నటించిన 7 మంది హీరోయిన్లు ఎవరు?
జ.7 మంది కాదు 8 మంది హీరోయిన్లు కనిపిస్తారు మా సినిమాలో. రమ్య కృష్ణ, కృతి శెట్టి, ఫరియా అబ్దుల్లా, మీనాక్షి దీక్షిత్,దర్శిని, వేదిక,దక్ష నగార్కర్,సిమ్రత్ కౌర్
ప్ర. ఈ సినిమా రన్ టైం ఎంత?
జ. 2 గంటల 35 నిముషాలు అండి!
ప్ర.మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?
జ. జ్ఞానవేల్ రాజా గారి నిర్మాణంలో చేయాల్సి ఉంది. కథ, హీరో అనేది ఇంకా డిసైడ్ కాలేదు.
ప్ర.అది బైలింగ్యువల్ మూవీనా?
జ.హీరోని బట్టి ఆధారపడి ఉంటుంది. అలా అని బైలింగ్యువల్ మూవీగా చేయాలని ఏమీ లేదు.నేనైతే తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే చేస్తాను.
ప్ర.ఫైనల్ గా ప్రేక్షుకులకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు?
జ. ఒమిక్రాన్ గురించి జనాలు ఆందోళన చెందాల్సిన పనిలేదు అని డాక్టర్లు చెప్పారు. ఇది కూడా ఒక ఫ్లూ లాంటిదే అని చెప్పారు..! సంక్రాంతికి హ్యాపీగా చూడదగ్గ సినిమా మా ‘బంగార్రాజు’. అన్ని జాగ్రత్తలు తీసుకుని థియేటర్ కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి..!