మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నామని ఇప్పటికే నలుగురు ప్రముఖ సెలబ్రిటీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులకు సంబంధించిన వివరాలను సైతం ప్రకటించారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కళ్యాణ్ రామ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరగడంతో పాటు పలు కథనాలు వచ్చాయి. అయితే వైరల్ అయిన వార్తలపై కళ్యాణ్ రామ్ టీమ్ స్పందించి స్పష్టతనిచ్చింది.
నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తా కథనాల్లో నిజం లేదని కళ్యాణ్ రామ్ ఏ పదవికి పోటీ చేయడం లేదని అతని టీమ్ వెల్లడించింది. కళ్యాణ్ రామ్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఎవరికి ఉంటుందనే ప్రశ్న సైతం వినిపిస్తూ ఉండటం గమనార్హం. ‘మా’ ఎన్నికలు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనున్నాయి. ప్రకాశ్ రాజ్, జీవిత, హేమ, మంచు విష్ణు అధ్యక్ష పదవీకి పోటీ పడుతుండగా ఒక్కో సెలబ్రిటీ కొన్ని అంశాలను ఎజెండాగా తీసుకొని బరిలోకి దిగారు.
ఎక్కువమంది సెలబ్రిటీలు పోటీ చేయడం వల్ల ఓట్లు చీలే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. పోటీ వల్ల ఒక్క ఓటు రిజల్ట్ ను డిసైడ్ చేసే పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తుండటం గమనార్హం. ‘మా’ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే వ్యక్తి ఎవరో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?