Amigos: ఓటీటీ కి అమిగోస్… ఎందులో అంటే..?

బింబిసార తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అమిగోస్. ఈ ఏడాది సంక్రాంతికి వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి రెండు హిట్లు అందించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుండీ వచ్చిన మూవీ ఇది. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం కనపరిచిన ఈ చిత్రం ఫిబ్రవరి 10 న .. అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండీ ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.

కొంతమంది సినిమా బాగుంది అంటున్నారు.. మరికొంత మంది బాలేదు అంటున్నారు. అయితే యూనిక్ కాన్సెప్ట్ కోసం అలాగే కళ్యాణ్ రామ్ నటన కోసం అమిగోస్ ను ఓ సారి ట్రై చేయొచ్చు .. అని నెగిటివ్ టాక్ చెప్పేవాళ్ళు కూడా మొహమాటంగా.. చెబుతున్నారు. మరోపక్క అమిగోస్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి. మార్నింగ్ షోలు హౌస్ ఫుల్స్.. పడిన ఏరియాలు చాలా తక్కువ. అన్ సీజన్, పరీక్షల సీజన్ కాబట్టి..

అమిగోస్ ను ధియేటర్ లో చూడాలనుకునే ప్రేక్షకులు ఎక్కువ మంది లేరు. వాళ్లంతా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అమిగోస్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుతున్న సమాచారం ప్రకారం సినిమా రిలీజ్ అయిన మూడు, నాలుగు వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అంటే మార్చ్ మొదటి వారం లేదా రెండో వారం నుండీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus