Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టేనా?

గతేడాది బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెకండ్ పార్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ హీరో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అమిగోస్ అనే సినిమాలో నటిస్తున్నారు. 2023 సంవత్సరం ఫిబ్రవరి నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమా టీజర్ ను ఈ నెల 8వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.

బింబిసార సక్సెస్ తో కథల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమ రాజేంద్ర రెడ్డి అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజైన పోస్టర్ కళ్యాణ్ రామ్ లుక్ భయంకరంగా ఉంది. తన సినీ కెరీర్ లో కళ్యాణ్ రామ్ ఎక్కువగా సాఫ్ట్ రోల్స్ లో నటించిన సంగతి తెలిసిందే. సాఫ్ట్ మూవీస్ లో ఎక్కువగా నటించిన కళాణ్ రామ్ అమిగోస్ మూవీలో మూడు రోల్స్ లో నటిస్తుండగా

ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జై లవకుశ తరహాలో కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. భారీ అంచనాలతో శివరాత్రి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ కు కథల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తన వంతు సహాయం చేస్తున్నారని తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ వరుస సక్సెస్ లను సొంతం చేసుకునేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. మైత్రీ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా కళ్యాణ్ రామ్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారని తెలుస్తోంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus