Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

2015 నందమూరి బ్రదర్స్ అయిన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కి కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే వరుస ప్లాపులతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్.. ఆ ఏడాది ‘పటాస్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదట ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే అనిల్ రావిపూడి మొదటి సినిమా ఇది. మొదటి సినిమాకి అతన్ని ఆడియన్స్ నమ్మలేదు. కానీ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో.. కళ్యాణ్ రామ్ సేఫ్ అయ్యాడు. థియేటర్ల నుండి మంచి లాభాలు వచ్చాయి.

Kalyan Ram

దాదాపు 10 ఏళ్ళ తర్వాత కళ్యాణ్ రామ్ కి అవసరమైన ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ పడింది. సో కళ్యాణ్ రామ్ మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టు అయ్యింది. ఆ వెంటనే ఎన్టీఆర్ కూడా ‘టెంపర్’ తో హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ఆ ఉత్సాహంతో కళ్యాణ్ రామ్ ‘కిక్ 2’ సినిమాని నిర్మించాడు. అయితే మొదట రూ.25 కోట్లు అనుకున్న ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.42 కోట్లకు వెళ్ళింది. మరోపక్క సమ్మర్ లో రిలీజ్ అనుకుంటే…పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే అవ్వడం వల్ల 2015 ఆగస్టు 21న రిలీజ్ చేయాల్సి వచ్చింది.

‘బాహుబలి’ ‘శ్రీమంతుడు’ వంటి సినిమాలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న టైం అది. మరోపక్క ‘కిక్ 2’ కి మిక్స్డ్ టాక్ వచ్చింది. పైగా ‘కిక్’ తో కంపేరిజన్స్ కూడా ఎక్కువయ్యాయి. ఓపెనింగ్స్ బాగానే వచ్చినా… తర్వాత సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. అలా ఈ సినిమా వల్ల కళ్యాణ్ రామ్ కు దాదాపు రూ.15 కోట్లు నష్టం వచ్చింది. బయ్యర్స్ కూడా నష్టపోయారు అని చెప్పాలి.

ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus