Devara: ‘దేవర’ గ్లింప్స్ ఎప్పుడో చెప్పేసిన కళ్యాణ్ రామ్!

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ తర్వాత రాబోతున్న మరో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘దేవర’ . రెండు పార్టులుగా ఈ మూవీ రూపొందనుంది. ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా..’ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక ‘దేవర’ నుండి గ్లింప్స్ రాబోతున్నట్టు.. కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ‘డెవిల్’ ట్రైలర్ లాంచ్ వేడుకలో కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు.

కళ్యాణ్ రామ్ ‘దేవర’ గ్లింప్స్ పై స్పందిస్తూ.. ” తమ్ముడు సినిమా (Devara) ‘దేవర’, ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత ఒక యాక్టర్ కి గాని, ఒక డైరెక్టర్ కి గాని, ఒక ప్రొడక్షన్ హౌస్ కి గాని ఎంత బాధ్యత ఉంటుంది. చిన్నపాటి ఒక విజువల్ లో గాని, కథలో గాని తప్పు జరిగింది అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా..! మేము తెలిసి మేము తప్పు చేయము. కానీ దాన్ని బాధ్యతగా తీసుకుని ఎంత కష్టపడతామో మాకు తెలుసు.

రేపు మీరు చూసేప్పుడు ఇంకా ఎక్కువ గోల చేయాలి అనే ఉద్దేశంతో మేము ఆలోచిస్తాము. త్వరలో గ్లింప్స్ రాబోతుంది. దానికి కావలసిన పనులన్నీ జరుగుతున్నాయి. వి.ఎఫ్.ఎక్స్ కి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఓ కొత్త ప్రపంచాన్ని చూపించాలి. ‘బింబిసార’ తో ఎలా అయితే కొత్త ప్రపంచాన్ని చుపించామో.. ‘దేవర’ తో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. దయచేసి ఓపిక పట్టండి. డేట్ కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాం” అంటూ చెప్పుకొచ్చాడు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus