Kalyan Ram: ఎన్టీఆర్30 విషయంలో వాళ్లకు కూడా క్లారిటీ లేదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత తెరకెక్కుతున్న మరో సినిమా కోసం ఫ్యాన్స్ సైతం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ లేకపోవడంతో అభిమానులు తెగ ఫీలవుతున్నారు. ఈ సినిమా నిర్మాతలలో కళ్యాణ్ రామ్ ఒకరనే సంగతి తెలిసిందే. బింబిసార ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తారని ఫ్యాన్స్ భావించారు.

అయితే కళ్యాణ్ రామ్ మాత్రం ఎన్టీఆర్30 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రావడానికి సమయం ఉందని సరైన సమయం వస్తే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతుండగా కళ్యాణ్ రామ్ మాటలు వాళ్లను మరింత కన్ఫ్యూజ్ చేస్తుండటం గమనార్హం. అనిరుధ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉంది.

ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో కళ్యాణ్ రామ్ కు సైతం క్లారిటీ లేదని ఆ కారణం వల్లే కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చెప్పలేకపోతున్నారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరోవైపు తారక్ సోషల్ మీడియా ద్వారా అయినా ఈ సినిమాకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొరటాల శివ వల్లే ఈ సినిమా ఆలస్యమవుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కొరటాల శివ ఆచార్య సినిమా వల్ల ఇబ్బందుల్లో పడగా ఆర్థిక సమస్యల వల్ల కొరటాల శివ స్క్రిప్ట్ పనులను ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది. ఆచార్య సినిమా వల్ల కొరటాల శివకు రెమ్యునరేషన్ దక్కకపోగా ఆయన రివర్స్ లో డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus