Kalyan Ram: డెవిల్ మూవీతో కళ్యాణ్ రామ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరుతుందా?

కళ్యాణ్ రామ్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న డెవిల్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అమిగోస్ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా డెవిల్ సినిమాకు మాత్రం రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమాలో 500 మంది ఫైటర్లతో ఫైట్ ఉంటుందని ఆ ఫైట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది. టాలీవుడ్ లోని బెస్ట్ యాక్షన్ సీన్లలో ఈ యాక్షన్ సీన్ ఒకటిగా ఉంటుందని తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ (Kalyan Ram) మరో భిన్నమైన పాత్రలో నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. 500 మంది ఫైటర్లతో కళ్యాణ్ రామ్ చేసే ఫైట్ క్లైమాక్స్ ఫైట్ అని సినిమా హైలెట్ సీన్లలో ఈ ఫైట్ కూడా ఒకటని సమాచారం అందుతోంది. థియేటర్లలో ఈ యాక్షన్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులతో సైతం విజిల్స్ వేయించేలా ఈ సాంగ్ ఉండనుందని సమాచారం అందుతోంది.

ఫైట్ మాస్టర్ వెంకట్ ఈ ఫైట్ సీన్ కోసం పని చేస్తున్నారని తెలుస్తోంది. నిర్మాత అభిషేక్ నామా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదని ఫిక్స్ అయ్యారని బోగట్టా. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గెటప్ కూడా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది. డెవిల్ సినిమాతో  కళ్యాణ్ రామ్ కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా సంయుక్త, మాళవిక నాయర్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్ మేడారం ఈ సినిమాకు దర్శకునిగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు కథ, కథనం, డైలాగ్స్ అందించడం గమనార్హం. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్ రామ్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలను ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus