Kalyan Ram: నాన్న వద్దంటేనే పేరు మార్చాము!: కళ్యాణ్ రామ్

నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి వారిలో హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. ఈయన హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ద్వారా ఈయన మరోసారి తన మార్క్ నిరూపించుకున్నారు. ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఈయన చిత్ర బృందంతో కలిసి సుమ షోలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ గురించి అలాగే ఎన్టీఆర్ చిన్న కుమారుడు గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను మొదటి రెండు సినిమాలు చేసినప్పుడు ఫ్లాప్ అయ్యాయి. ఇక నేను సినిమాలకు పనికిరాను అంటూ చాలామంది కామెంట్లు చేశారు. కానీ నాన్న మాత్రం నన్ను ఎంతగానో ప్రోత్సహించారని కళ్యాణ్ రామ్ తెలిపారు.

నేను ప్రొడక్షన్ హౌస్ ప్రారంభిస్తానని చెప్పినప్పుడు నటుడిగా నిర్మాతగా నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను అనేలా ఉంటే అభ్యంతరం లేదని నాన్న నన్ను ప్రోత్సహించారు. ఇక నా బ్యానర్ కు హరిలక్ష్మి అని అమ్మానాన్నల పేరు పెడదామని చెప్పాను కానీ నాన్న వద్దన్నారు. నేడు మనం ఈ స్థాయిలో ఉన్నాము అంటే అందుకు కారణం తాతగారు ఎన్టీఆర్ కారణం. ఆ మహానుభావుడి పేరు పెట్టు అని చెప్పడంతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అని పెట్టుకున్నాము అంటూ కళ్యాణ్ రామ్ తెలిపారు.

ఇంట్లో మీ పిల్లలు తారక్ పిల్లలు కలిస్తే గోలగోలగా ఉంటుంది ఎవరు బాగా అల్లరి చేస్తారు అంటూ ఈయనకు ప్రశ్న ఎదురయింది ఈ ప్రశ్నకు కళ్యాణ్ రామ్ సమాధానం చెబుతూ.. మా పిల్లల కాస్త పెద్ద అయ్యారు కాబట్టి అల్లరి ఉండదు కానీ ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ మాత్రం చాలా ముదురు బాగా అల్లరి చేస్తారు అంటూ కళ్యాణ్ రామ్ (Kalyan Ram) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus