Kalyan Ram: సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కళ్యాణ్ రామ్ సినిమా..!

నందమూరి కళ్యాణ్ రామ్..జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తుంటాడు. తనకు కథ నచ్చితే చాలా రిస్క్ కూడా తనే తీసుకుంటాడు. ‘వరుస ప్లాపులు వస్తున్నాయి.. ఇక కళ్యాణ్ రామ్ పని అయిపోయింది’ అనుకునే టైంలో బ్లాక్ బస్టర్ కొట్టి ఆ కామెంట్స్ కు ఫుల్ స్టాప్ పెడుతుంటాడు ఈ నందమూరి హీరో. అందుకే ఇతన్ని ఇండస్ట్రీలో డైనమిక్ స్టార్ అంటుంటారు. ఇటీవల వచ్చిన ‘బింబిసార’ చిత్రం ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.

ఆ సినిమా బడ్జెట్ కు కళ్యాణ్ రామ్ మార్కెట్ కు ‘నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’. కళ్యాణ్ రామ్ మార్కెట్ రూ.15 కోట్లు అనుకుంటే ఆ సినిమా బడ్జెట్ రూ.45 కోట్లు అయ్యింది. అయినా కళ్యాణ్ రామ్ అంచనా తప్పలేదు. ఆ సినిమా థియేట్రికల్ రన్ పరంగానే రూ.37 కోట్ల షేర్ వరకు కలెక్ట్ చేసింది. ఇక డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ రూపంలో మరో రూ.25 కోట్లు వచ్చినట్టు అంచనా.

ఇక ఈ చిత్రం షూటింగ్ ను కంప్లీట్ చేస్తూనే కళ్యాణ్ రామ్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్ ను కూడా కంప్లీట్ చేశాడు. టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ బ్యానర్లలో ఒకటైన ‘ మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మాణంలో కళ్యాణ్ రామ్ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇది 19వ చిత్రం.ఈ చిత్రాన్ని రాజేంద్ర రెడ్డి అనే నూతన ద‌ర్శ‌కుడు తెరకెక్కిస్తున్నాడు.

క‌ళ్యాణ్ రామ్ కు జోడీగా ఆషిక రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవల జరిగిన గోవా షెడ్యూల్‌తో దాదాపు సినిమా పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ కూడా చిన్నదే అని టాక్. త్వరలోనే ఆ షెడ్యూల్ ప్రారంభం కానుంది. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus