Kalyan Ram: ఆ కారణంతోనే బాలయ్య షోకి దూరంగా ఉన్న కళ్యాణ్ రామ్!

తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్నటువంటి టాక్ షో అన్ స్టాపబుల్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఆహ్వానించి బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలను రాబడుతూ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతున్నారు. ఇలా ఈ కార్యక్రమం ఇప్పటికే మొదటి సీజన్ పూర్తిచేసుకుని రెండవ సీజన్ కూడా ముగింపు దశకు చేరుకుంది.

రెండవ సీజన్లో భాగంగా ఏకంగా సినిమా సెలబ్రిటీలను మాత్రమే కాకుండా రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈ కార్యక్రమం రెండవ సీజన్ కూడా పూర్తి కానుంది.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు నందమూరి వారసులు అయినటువంటి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా పాల్గొనలేదు. ఈ విధంగా నందమూరి హీరోలతో పాటు మెగా హీరోలు అయినటువంటి రామ్ చరణ్ చిరంజీవి వంటి హీరోలు కూడా పాల్గొనలేదు.

అయితే రామ్ చరణ్ బాలకృష్ణ పిలవాలే గాని రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రభాస్ ఎపిసోడ్లో తెలియజేశారు. బహుశా ఈయన మూడవ సీజన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే నందమూరి వారసుల అయినటువంటి కళ్యాణ్ రామ్ ఈ కార్యక్రమానికి రాకపోవడం గురించి తాజాగా కళ్యాణ్ రామ్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా కళ్యాణ్ రామ్ కి యాంకర్ నుంచి ఎందుకు మీరు బాలయ్య షోలో పాల్గొనలేదు అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు కళ్యాణ్ రామ్ సమాధానం చెబుతూ ఈ ప్రశ్న మీరు ఆహా వారిని అడిగితే బాగుంటుందని సమాధానం చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఆహా వారు వీరికి ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. బహుశా వీరందరినీ కూడా సీజన్ 3 లో పిలవాలనే ఆలోచనలో ఆహా మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి సీజన్ 3 లో అయిన నందమూరి హీరోలు ఈ టాక్ షోలో పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus