ఐయామ్ వెయిటింగ్ కాజల్ అంటున్న కళ్యాణ్ రామ్!

కాజల్ ని టాలీవుడ్ చందమామ అంటే ఎవరికైనా ఈజీగా గుర్తు పట్టేస్తారు. అభిమానుల నుంచి ఎన్నో బిరుదులను అనుకున్న అమ్మడు కెరీర్ స్టార్ట్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా ఇంకా సౌత్ ఇండస్ట్రీని కుమ్మేస్తూనే ఉంది. ఓ రెండు అపజయాలు అలా వచ్చాయంటే చాలు వరుసగా నెక్స్ట్ సినిమాలతో హిట్స్ అందుకుంటోంది. ఈ మూడు పదుల బ్యూటీ అందాలకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది.

అందుకే అనుకుంటా.. వరుసగా హిట్స్ కొట్టేసింది. అంతే కాకుండా రెమ్యునరేషన్ ని కూడా గట్టిగా పెంచేసింది. ప్రస్తుతం తెలుగు తమిళ్ లో భారీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అయితే అమ్మడు మాత్రం ఏ అవకాశాన్ని వదులోకోవడం లేదు. దీంతో ఇతరుల సినిమాల షూటింగ్ లను వెయిటింగ్ లిస్టులో పెట్టేసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కూడా అమ్మడి కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ తెరకెక్కిస్తోన్న ఎమ్మెల్యే సినిమాలో కాజల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఫైనల్ షెడ్యూల్ అయిపోతే త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ కాజల్ పారిస్ లో ఉంది. బాలీవుడ్ మూవీ క్వీన్ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’లో కాజల్ నటిస్తోంది. అమ్మడు ఆ షూటింగ్ కోసం వెళ్లగా ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఆమె కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది. మొదట్లో కాలిగానే ఉన్న అమ్మడు ఇప్పుడు సడన్ గా వెళ్లే సరికి రిలీజ్ డేట్ పై కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం లేదు. మరి కాజల్ ఎన్ని రోజులు ఇలా ఎమ్మెల్యే గారిని వెయిట్ చేయిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus