ఎం.ఎల్.ఏ షూటింగ్ సమయంలో గాయపడ్డ కళ్యాణ్ రామ్

ఇజం తర్వాత కళ్యాణ్ రామ్ నిర్మాతగా జై లవకుశ తీయడంతో కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే రెండు చిత్రాలను మొదలెట్టారు. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో హీరోగా “ఎంఎల్ఏ” సినిమా చేశారు. “మంచి లక్షణాలున్న అబ్బాయి” అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని మార్చి 23న రిలీజ్ కావడానికి ముస్తాబవుతోంది. బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక “నా నువ్వే” సినిమాని కూడా దాదాపు కంప్లీట్ చేశారు.

కొన్ని రోజుల క్రితం వికారాబాద్‌లో నా నువ్వే చిత్రానికి సంబంధించి యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కిస్తున్న టైంలో క‌ళ్యాణ్ రామ్ మోచేతికి గాయ‌మైంది. అప్పుడు చికిత్స తీసుకున్న క‌ళ్యాణ్‌కి వైద్యులు కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చారు. కాని అనుకున్న టైంకి సినిమాని పూర్తి చేయాల‌నే ఉద్దేశంతో నొప్పిని భరిస్తూ చిత్రీకరణలో పాల్గొన్నారు. దీంతో నొప్పి ఎక్కువైంది. ఇప్పుడు వైద్యులను సంప్రదిస్తే.. వారు సరైన వైద్యం అందించి నెల రోజుల పాటు తప్పకుండా రెస్ట్ అవసరమని సూచించారని తెలిసింది. ఎం.ఎల్.ఏ సినిమా ప్రచారాన్ని ముమ్మరం చేయాలనీ అనుకున్న సమయంలో నొప్పి తీవ్రతరం కావడం కళ్యాణ్ రామ్ ని శారీరకంగానే కాకుండా, మానసికంగా బాధపెడుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus