Ranbir Kapoor, Alia Bhatt: స్టార్లు, వారి కుటుంబాలను టార్గెట్‌ చేస్తున్నాడుగా…!

బాలీవుడ్‌లో సినిమాల మీదే కాదు… ఏ అంశం మీదైనా, ఏ వ్యక్తి మీదైనా రివ్యూలు రాసేసే వ్యక్తి ఒకరు ఉన్నారు. అతనే కమాల్‌ ఆర్‌ ఖాన్‌. గతంలో చాలా సార్లు సినిమాల రివ్యూలతో హీరోలు, వాళ్ల అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అయినా తన పంథా మార్చుకోకుండా అలానే కొనసాగిస్తున్నాడు. తాగాజ ‘భుజ్‌’ సినిమా ట్రైలర్‌ గురించి ఆరు పేజీల స్క్రిప్ట్‌ రాసుకొని ఏకి పారేశాడు. అది పక్కన పెడితే ప్రెడిక్షన్స్‌ పేరుతో బాలీవుడ్‌ తారల వ్యక్తిగత జీవితాలను అంచనా వేస్తున్నాడు.

కమాల్‌ ఆర్‌ ఖాన్‌ ఏం చేసినా… విమర్శ ఉంటుంది. ఇప్పుడు ప్రెడిక్షన్స్‌లో కూడా అదే కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆయన ఎనిమిది అంచనాలు చెప్పాడు. తాజా అంచనా నుండి చూస్తే… ఎనిమిదోది రణ్‌బీర్‌కపూర్‌ – ఆలియా భట్‌ పెళ్లి గురించి. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఆఖరిలో జరుగుతుందట. అయితే 15 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోతారట. ఇక ఏడోది, ఆరోది వరుసగా చూసుకుంటే టబు, కంగనా రనౌత్‌ ఇలానే పెళ్లి కాకుండానే ఉండిపోతారట.

ఇక ఐదో అంచనా… దేశ రాజకీయ, ప్రజల గురించి రాసుకొచ్చారు. దాని గురించి రాయడం అంత శ్రేయస్కరం కాదు. నాలుగోది అయితే… దారుణమైన విమర్శ అని చెప్పొచ్చు. బాలీవుడ్‌లో ఓ హీరో… తన తండ్రి పోయాకే పెద్ద స్టార్‌ అవుతారని చెప్పాడు. అదెవరు అనేది చెప్పలేదు. మూడో అంచనా అయితే ప్రియాంక చోప్రా – నిక్ జొనాస్‌ గురించి. వీరు రానున్న పదేళ్లలో విడిపోతారని అంచనా వేశాడు కమాల్‌. అసలు మొదటి అంచనా అయితే ఇంకా షాక్‌. సరైన పేర్లు పెట్టని కారణంగా సైఫ్‌ అలీ ఖాన్‌- కరీనా కపూర్‌ సంతానం హీరోలుగా నిలదొక్కుకోలేరని అంచనా వేశాడు. రెండో అంచనా వదిలేయలేదు. అది కూడా రాజకీయ కోణమే అందుకే పక్కన పెట్టాం.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus