ఇప్పుడు పాన్ ఇండియా సినిమా.. అంటూ నేటి తరం డైరక్టర్లు, హీరోలు, సినిమా జనాలు మాట్లాడుకుంటున్నారు కానీ.. ఎప్పుడో సుమారు 35 ఏళ్ల క్రితమే అలాంటి సినిమా ఒకటి వచ్చింది. అదే ‘నాయకుడు’. కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు. ఇప్పుడు తిరిగి ఈ కాంబోకు రంగం సిద్ధమైంది. కమల్‌హాసన్ 234వ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు.
మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్, రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ‘‘35ఏళ్ల క్రితం మణిరత్నంతో సినిమా ప్రారంభించేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో.. ఇప్పుడూ ఆయనతో పనిచేసేందుకు అంతే ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అంటూ కమల్ హాసన్ ఈ సినిమా గురించి చెప్పారు. ‘‘కమల్‌తో మళ్లీ కలసి పనిచేయడం సంతోషంగా, గౌరవంగా, ఉత్సాహంగా ఉంది’’ అని మణిరత్నం స్పందించారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తారు.
ఉదయనిధి స్టాలిన్ నిర్మాణంలో రూపొందనున్నీ సినిమా 2024లో విడుదలవుతుందట. అయితే సినిమా కథేంటి, ఎలా ఉండబోతోంది, ఎలాంటి కాస్ట్ అండ్ క్రూ ఉంటారు అనే విషయాలు వెల్లడించలేదు. త్వరలో భారీ ఈవెంట్‌లో ఈ వివరాలను వెల్లడిస్తారని టాక్. ‘విక్రమ్’ సినిమా విజయం తర్వాత కమల్‌హాసన్ ఫుల్‌స్వింగ్‌లో ఉన్నారు. ఆగిపోయిన ‘ఇండియన్ 2’ సినిమాను తిరిగి ప్రారంభించారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
మరోవైపు మణిరత్నం కూడా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ జోష్‌లో ఉన్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తమిళనాట భారీ వసూళ్లను అందుకుంది. థియేటర్లతోపాటు ఓటీటీలోనూ సినిమా అదరగొడుతోంది. ‘పొన్నియిన్ సెల్వన్’ రెండో పార్టును వచ్చే ఏడాది విడుదల చేస్తారు. తొలి పార్టును మించి రెండో పార్టు ఉండబోతోందని టాక్. ఇక ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కమల్ సినిమా పనులు మొదలవుతాయి.
Most Recommended Video
లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!