లోకనాయకుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటాడని అందరూ భావించారు.. అయితే రాజకీయ నేతగా కొనసాగుతూనే సినిమాలు కూడా చేస్తానని ప్రకటించాడు.. అంతే కాకుండా శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 మూవీకి డేట్స్ కూడా ఇచ్చేశాడు.. ఇది ఇలా ఉండగానే మరో హిట్ మూవీ తేవర్ మగన్ సీక్వెల్ చేయనున్నట్లు ప్రకటించాడు..తెలుగులో ఈ మూవీ క్షత్రియ పుత్రుడు గా విడుదలై హిట్ కొ్టింది. శంకర్ “ఇండియన్ 2” పూర్తైన తర్వాత ఈ సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
ఇకపోతే.. ఇటీవల “బిగ్ బాస్” సెకండ్ సీజన్ ను కూడా సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసిన కమల్ హాసన్ మూడో సీజన్ కి హోస్ట్ గా కంటిన్యూ అవుతానని చెప్పాడట. సదరు షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వొచ్చనేది కమల్ హాసన్ ఆలోచన కావచ్చు. ఒకపక్క మన తెలుగు హీరోలు రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు దూరమవుతుంటే.. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి హీరోలు మాత్రం రాజకీయాల్లోకి వచ్చాక సినిమాల జోరు పెంచారు.