Kamal Haasan, Venkatesh: వెంకటేశ్‌తో సినిమా గురించి కమల్‌ హాసన్‌ కామెంట్స్‌ వైరల్‌!

కమల్‌ హాసన్‌ – వెంకటేశ్‌ ఇదొక డిఫరెంట్‌ కాంబినేషన్‌. వినడానికి, చూడటానికి కూడా కొత్తగా ఉంటుంది. అలాంటి కాంబినేషన్‌ను చూపించిన చిత్రం ‘ఈనాడు’. ఈ సినిమాలో ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించేది ఒకసారే. అయితే ఆ ఒక్క సీన్‌ కూడా వావ్‌ అనిపిస్తుంది. మరి ఇద్దరూ కలసి ఓ పూర్తిస్థాయి సినిమా చేస్తే అదిరిపోతుంది. కమల్‌ హాసన్‌ కూడా ఇదే మాట అన్నారు. గతంలో ఒకసారి అనుకున్నాం కుదర్లేదు, కానీ ఈసారి చేస్తాం అని కూడా చెప్పారు.

కమల్, వెంకీ సినిమా గతంలో అనుకున్నారనే విషయం చాలా తక్కువమందికే తెలుసు. అది కూడా ఇప్పుడు కాదు. 2008లో కమల్‌ హాసన్‌ ‘మర్మ యోగి’ అనే సినిమా చేద్దాం అనుకున్నారు. చాలా రోజులు ప్రయత్నాలు జరిపిన తర్వాత ఆ సినిమా ప్రారంభంలోనే వదిలేశారు. ఆ సినిమాలోనే వెంకటేశ్‌కు ఓ మంచి పాత్ర ఆఫర్‌ చేశారట కమల్‌. కానీ ఆ సినిమా రాకపోవడంతో కుదర్లేదు. మధ్యలో ‘ఈనాడు’ చేశారు. ఇప్పుడు మళ్లీ ఏదైనా సినిమా చేద్దాం అని వెంకీతో అన్నారు కమల్‌.

దీంతోపాటు కమల్‌ హాసన్‌ వెంకటేశ్‌ గురించి మరొక విషయం కూడా చెప్పారు. నితిన్‌ ఆ విషయాల్ని ఆదర్శంగా తీసుకొంటే ఉన్నతస్థానాలకు వెళ్తాడు అని కూడా చెప్పారు కమల్‌. ‘‘నితిన్‌ మీరు వెంకీని చూసి నేర్చుకోండి. అప్పుడు త‌ప్ప‌కుండా సూప‌ర్ స్టార్ అవుతారు. నేను వెంకీలా గోల్డెన్ స్పూన్‌తో పుట్టుంటే పాడైపోయేవాడినేమో. వెంకీలా క‌ష్ట‌ప‌డి స్టార్ అయ్యేవాణ్ని కాదేమో. అంఉదకే నితిన్ ఈ విష‌యంలో వెంకీని ఆద‌ర్శంగా తీసుకోవాలి” అని స‌ల‌హా ఇచ్చారు కమల్ హాసన్‌.

అలాగే గతంలో వెంకటేశ్‌కి ఇచ్చిన సలహాల గురించి కమల్‌ హాసన్‌ గుర్తు చేసుకున్నారు. చాలా ఏళ్ల క్రితం వెంకటేశ్‌ ఓసారి గోవాలో కమల్‌ హాసన్‌ను కలిశారట. ‘నేను సినిమాలు చేస్తున్నా, హిట్‌ కొడుతున్నా, కానీ.. మ‌న‌సులో ఏదో అసంతృప్తి ఉంది’ అని కమల్‌తో అన్నారట వెంకీ. అప్పుడు తనకు తోచిన కొన్ని స‌ల‌హాలు వెంకీకి ఇచ్చారట. ఆ త‌ర‌వాత వెంకటేశ్‌ ప్ర‌యాణ‌మే మారిపోయిందనిని క‌మ‌ల్ గుర్తు చేసుకున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus