లోక నాయకుడు కమల్ హాసన్ సినిమాల ఎంపిక భలే వైవిధ్యంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు కమల్ ఓకే చేస్తారా? అని కూడా మనకు అనిపిస్తుంటుంది. అలాగే ఆయన కొన్ని సినిమాల్ని వదిలేయడం కూడా కొత్తగానే ఉంటుంది. ఏంటీ ఈ సినిమా కమల్ వదిలేశారా అని అనుకుంటుంటాం. రీసెంట్‌గా కమల్ ‘ప్రాజెక్ట్ కె’లో భాగయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో వదులకుకున్న సినిమాల లిస్ట్ ఒకట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సినిమాల్ని ఆయన ఎందుకు వదులుకున్నారో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
అర్జున్ సర్జా బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటైన ‘జెంటిల్‌మేన్’ తొలుత (Kamal Haasan) కమల్ హాసన్ దగ్గరకే వచ్చింది. అయితే అప్పటికి ఆయన వేరే ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్ల అర్జున్ దగ్గరకు వెళ్లారట దర్శకుడు శంకర్. దీంతో ఆ సినిమాను కమల్ మిస్ అయ్యారు. ఆ తర్వాత మరోసారి శంకర్ సినిమానే కమల్ వదులుకున్నారు. అప్పుడు కూడా అర్జునే ఆ సినిమా చేశారు. అదే ‘ఒకే ఒక్కడు’. వన్ డే సీఎం కాన్సెప్ట్‌లో రూపొందిన ఆ చిత్రం కథతో శంకర్ వెళ్తే ఓ ఏడాది తర్వాత అన్నారట కమల్.
‘హే రామ్’ సినిమా కారణంగానే కమల్ ఈ ప్రాజెక్ట్ మిస్ అయ్యారని చెప్పొచ్చు. ఆ సినిమా చేసుంటే కమల్ పొలిటికల్ ఇమేజ్‌కు ఆ సినిమా బాగా ఉపయోగపడేది కూడా. కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ డైరెక్టర్‌గామారి తెరకెక్కించిన సినిమా ‘మై హూ నా’. షారుఖ్ ఖాన్, సుస్మితా సేన్, అమృతా రావు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రమిది. ఈ సినిమాలో సునీల్ శెట్టి పోషించిన మెయిన్ విలన్ పాత్ర కోసం తొలుత కమల్‌ను అనుకున్నారట. షారుఖ్ ఖాన్ కమల్‌ను ఒప్పించే ప్రయత్నం చేయగా.. ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఆఫర్ తిరస్కరించారట.
రజనీకాంత్ – శంకర్ సినిమా ‘రోబో’ కూడా కమల్ దగ్గరకు వచ్చింది. 2000 సమయంలో కమల్ హాసన్, ప్రీతి జింటా కలయికలో ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు కూడా. అయితే వివిధ కారణాల వల్ల సినిమా ముందుకెళ్లలేదు. దీంతో పదేళ్ల తర్వాత రజనీ కాంత్, ఐశ్వర్య రాయ్‌తో శంకర్ ఈ సినిమా చేశారు. కమల్ హాసన్, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో పీరియాడిక్ సినిమా ‘మర్మయోగి’ ప్రకటించారు. కమల్ ఈ సినిమా రచన, దర్శకత్వం చేయాలనుకున్నారు. కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
హిందీ సినిమా ‘మున్నా భాయ్ MBBS’ను చిరంజీవి ‘శంకర్ దాదా MBBS’గా తీయగా.. తమిళంలో కమల్ ‘వసూల్ రాజా MBBS’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘లగే రహో మున్నా భాయ్’ రీమేక్‌ను మాత్రం కమల్ ఓకే చేయలేదట. దీని మీద చాలా చర్చలు జరిగినా ఆయన నో చెప్పేశారట. ఇక కమల్ హాసన్, అసిన్ జంటగా ‘19 స్టెప్స్’ అనే ఇండో – జపనీస్ ప్రాజెక్ట్ చేయటానికి ప్రయత్నాలు జరిగాయి. భరత్ బాలా దర్శకత్వంలో వాల్ట్ డిస్నీ ఈ సినిమా నిర్మించాల్సింది. అయితే కమల్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో పూర్తిగా సినిమా పక్కనపెట్టేశారు.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!