Kamal Haasan: ఇండియన్2 సినిమా స్టోరీపై ట్విస్ట్ ఇచ్చిన కమల్.. ఆ ఊహలు నిజం కావా?

మరికొన్ని వారాల్లో రిలీజ్ కానున్న ఇండియన్2 (Bharateeyudu 2) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారతీయుడు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు. జులై నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. కల్కి (Kalki 2898 AD)  విడుదలైన రెండు వారాల తర్వాత ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయగా ఇండియన్2 సినిమా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ట్రైలర్ లో శంకర్  (Shankar)  మార్క్ స్పష్టంగా కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఇండియన్2 మూవీ స్టోరీకి సంబంధించి వైరల్ అవుతున్న వార్తలకు కమల్ హాసన్ (Kamal Haasan)  చెక్ పెట్టారు. వైరల్ అవుతున్న కథల్లో నిజం లేదని ఈ సినిమా కథను ఎవరూ ఊహించలేకపోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

ఇండియన్2 మూవీకి సంబంధించి ప్రమోషన్స్ లో మరింత వేగం పెరగాల్సి ఉంది. ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), ఎస్.జే సూర్య  (S. J. Suryah) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ (Anirudh Ravichander) ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా 350 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండియన్2 రిజల్ట్ గేమ్ ఛేంజర్ మూవీ (Game Changer) బిజినెస్ ను ప్రభావితం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఇండియన్2 సినిమా సక్సెస్ సాధిస్తే మరిన్ని టాలీవుడ్ భారీ సినిమాల దిశగా అడుగులు పడతాయని చెప్పవచ్చు. రకుల్ (Rakul Preet Singh) కెరీర్ కు సైతం ఈ సినిమా కీలకం కానుండగా షాకింగ్ ట్విస్ట్ తో ఈ సినిమాను ముగిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే కోలీవుడ్ ఇండస్ట్రీ మరింత పుంజుకునే అవకాశాలు ఉంటాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus