సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు కమల్ హాసన్. మక్కల్ నీది మయ్యమ్ పేరుతో పార్టీ స్థాపించి ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ప్రధాన పార్టీల మధ్య జరిగిన పోరుగా ఎన్నికలు మారడంతో … కమల్ పార్టీ ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. కమల్ కూడా ప్రజామోదం పొందలేకపోయాడు. దీంతో తిరిగి సినిమాల్లోకి వీలైనంత త్వరగా వచ్చేయాలని అనుకుంటున్నాడట. ‘ఇండియన్ 2’ సినిమాను పట్టాలెక్కిద్దామని చూస్తున్నాడట.
‘ఇండియన్ 2’ సినిమాను చిత్రీకరణ వాయిదా పడటానికి కరోనా ఎంత కారణమో, కమలూ అంతే కారణమని అంటుంటారు. షూటింగ్‌లో క్రేన్ ప్రమాదం జరిగినప్పుడు నిర్మాతలు సరిగా స్పందించలేదని కమల్ నొచ్చుకున్నాడు. దీంతో చిత్రీకరణ ఆగిపోయింది. ఆ తర్వాత మొదలైనట్లు కనిపించినా… కరోనా వచ్చి ఆపేసింది. పరిస్థితులు సద్దుమణిగాక షూటింగ్ చేద్దామంటే కమల్ ఇటువైపు చూడలేదట. కొన్ని రోజులకు ఎన్నికల వైపు వచ్చేశాడు. దీంతో దర్శకుడు శంకర్ వేరే సినిమాలు ఓకే చేసుకున్నాడు. కానీ పరిస్థితి ఇప్పుడు అంతా మారిపోయింది.
కమల్ రాజకీయాల్లో యాక్టివ్ ఉందామన్నా… ఇప్పట్లో ఉపయోగం లేదు. ఎన్నికలు అయిపోయాయి, పార్టీ తరఫున ఎవరూ గెలవలేదు. ఇన్నాళ్లూ పక్కన ఉన్నవాళ్లు ఇప్పుడు దూరమవుతున్నారు. దీంతో మళ్లీ ముఖానికి రంగేసుకోవాలని చూస్తున్నాడట. శంకర్‌తో మాట్లాడి ‘ఇండియన్ 2’ ప్రారంభిస్తాడట. ఇప్పటికే ఈ సినిమా కోసం నిర్మాతలు ₹180 నుండి ₹200 కోట్లు ఖర్చుపెట్టేశారని టాక్. ఆ డబ్బు బూడిదలో పోసిన పన్నీరు కాకూడదంటే వెంటనే సినిమా ప్రారంభించాలి. ఇలాంటి అన్నీ కారణాలతో ఈ సినిమా మొదలుపెట్టడమే కాకుండా, మరిన్ని సినిమాలు ఓకే చేసేయాలని కమల్ చూస్తున్నారట. అన్నట్లు ‘ఇండియన్ 2’తోపాటు ‘విక్రమ్’లో కూడా కమల్ నటించాల్సి ఉంది.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!