ఇటీవల విడుదలైన ‘విక్రమ్’ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు కమల్ హాసన్. ఇప్పుడు ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు మన యూనివర్శల్ హీరో. ఇలాంటి సమయంలో ఆయనకు తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు కోర్టు నోటీసులు పంపించిందనే వార్తలు మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది..? తమిళనాడు ప్రభుత్వం కమల్ హాసన్ కి ఎందుకు నోటీసులు పంపించిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చెన్నైలో రెండో దశ మెట్రో పనులు జరుగుతున్నాయి.
అందులో ఆళ్వార్ పేటలో ఉన్న కమల్ హాసన్ ఇంటి నుంచే మెట్రో వెళ్తుంది. స్టేషన్ ను నిర్మించడానికి 170 చదరపు అడుగులు కావలి. ఆ స్థలం కోసం తమిళనాడు ప్రభుత్వం కమల్ హాసన్ కు నోటీసులు పంపించింది. ఈ స్థలంలోనే కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ ఆఫీస్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఆఫీసులు కూడా ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఇటు కమల్ హాసన్ కానీ, అటు స్టాలిన్ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు స్పందించలేదు.
మరి కమల్ స్వచ్ఛదంగా ముందుకొచ్చి మెట్రో కోసం సదరు స్థలాన్ని ఇస్తారో.. లేదో చూడాలి. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. స్టాలిన్ ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలను చేయడం లేదు. ఈ క్రమంలో కమల్ కి ఎదురైనా సమస్యలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
ఇక కమల్ సినిమాల విషయానికొస్తే.. ‘విక్రమ్’ సినిమాతో హిట్ అందుకున్న ఆయన త్వరలోనే ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేయబోతున్నారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్.. చరణ్ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే కమల్ హాసన్ సినిమాను పూర్తి చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి శంకర్.. కమల్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తారో చూడాలి!
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!