ఏ మాటా అనకుండానే.. ఏ కౌంటర్ పడకుండానే.. ఇద్దరు అగ్ర హీరోల మధ్య లేదంటే ఇద్దరు నటుల మధ్య ఏదో జరిగిపోతోంది, జరిగిపోయింది, అలా అన్నారట, ఇలా అన్నారట అని కామెంట్లు వినిపిస్తున్న రోజులివి. అలాంటి ఓ అగ్ర హీరో గురించి, ఇంకో అగ్ర హీరో ఓపెన్‌గా ‘అసూయ’ కామెంట్లు చేస్తే ఇంకేమైనా ఉందా? కచ్చితంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు రియాక్ట్ అయ్యేంతవరకు ఆ చర్చ ఆగదు. ఇలాంటి పరిస్థితే వచ్చింది ప్రముఖ నటులు రజనీకాంత్ – కమల్ హాసన్ మధ్యలో.
ఆ కామెంట్ల వల్ల జరిగే చర్చ, అనవసరమైన రచ్చ ఎందుకు అని అనుకున్నారో ఏమో రజనీకాంత్ చేసిన కామెంట్ గురించి కమల్ హాసన్ రియాక్ట్ అయి విషయాన్ని సద్దుమణిగేలా చేసేశారు. అయితే నిజంగా సద్దుమణుగుతుందా అంటే తర్వాత చూడాలి. ఇక రజనీ చేసిన కామెంట్లేంటి, వాటికి కమల్ ఇచ్చిన రియాక్షన్ ఏంటి అనేది చూద్దాం.
విజయ్ సీఎం అయ్యారు కదా కొన్ని రోజుల క్రితం రజనీకాంత్ దగ్గర ప్రస్తావిస్తే.. కమల్ సీఎం అయితే అసూయపడతా కానీ.. విజయ్ అయితే ఎందుకు అసూయ పడతా అని అన్నారు రజనీకాంత్. దాని మీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. దానికి కమల్ రియాక్ట్ అవుతూ.. ఆ రోజు రజనీ ఆ మాటల్ని నవ్వుతూ చెప్పారు. అయినా మేం ఒకరితో ఒకరం పోటీ పడతాం కానీ, ఎందుకు అసూయ పడతాం అని కమల్ తిరిగి ప్రశ్నించారు.
తాను, రజనీకాంత్ 20 ఏళ్ల వయసులోనే ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శలు చేసుకోకూడదని నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగతా కమల్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ ఇద్దరూ రెండు ప్రాజెక్టుల్లో భాగమైన విషయం తెలిసిందే. ఓ ప్రాజెక్ట్‌కు కమల్ నిర్మాత.. రజనీ హీరో. మరో ప్రాజెక్ట్‌లో ఇద్దరూ నటిస్తున్నారు. అయితే అందులో హీరో ఎవరు? విలన్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM&pp=0gcJCQQLAYcqIYzv