Kamal Hassan: ‘ఇండియన్‌ 2’పై కమల్‌ హాసన్‌ కొత్త కామెంట్!

సౌత్‌ ప్రేక్షకులకు చాలా రోజుల నుండి మనసులో ఉండిపోయిన ప్రశ్న ‘ఇండియన్‌ 2’ ఏమైంది అని. కమల్‌ హాసన్‌ ఇటీవల రాజకీయాల్లోకి వెళ్లడం, తిరిగి వచ్చాక ‘విక్రమ్‌’ సినిమాను వాయు వేగంతో పూర్తి చేయడంలో ఉండిపోయాడు. దీంతో ‘ఇండియన్‌ 2’ సమాచారం బయటకు రాలేదు. అయితే ‘విక్రమ్‌ 2’ సినిమా ప్రచారం కోసం ఆయన బయటకు రావడంతో ‘ఇండియన్‌ 2’ సినిమాకు సంబంధించి విషయాలు కూడా తెలుస్తున్నాయి. దర్శకుడి విషయంలో ఇటీవల క్లారిటీ ఇచ్చిన కమల్‌, ఇప్పుడు సినిమాపై ఆసక్తికర కామెంట్‌ చేశారు.

శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇండియన్‌ – 2’పై కమల్‌ హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఒకే సినిమాపై పదేళ్లు ఉండలేం కదా’ అంటూ కమల్‌ వెరైటీగా మాట్లాడారు. అలా ఆయన అనడం వెనుక ఉన్న కారణం తెలిస్తే దటీజ్‌ కమల్‌ అని తప్పకుండా అంటారు. కమల్‌ తన తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ‘ఇండియన్‌ – 2’ గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో ‘ఇండియన్‌-2’ ప్రాజెక్ట్‌ ఆగిపోలేదని, తప్పకుండా ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు.

‘‘కరోనా, సెట్‌లో యాక్సిడెంట్‌ లాంటి కారణాలతో ‘ఇండియన్‌ 2’ చిత్రీకరణ ప్రారంభించిన నాటి నుండి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ‘ఇండియన్‌ 2’ చిత్ర నిర్మాణ సంస్థ లైకా వాళ్లతో మేం ఇప్పటికే మాట్లాడాం. వాళ్లు సినిమాని త్వరగా పూర్తి చేయాలనే ఆశగా ఉన్నారు. త్వరలోనే షూట్‌లో పాల్గొని, వీలైనంత త్వరగా సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తాం. ఈ ఒక్క సినిమాపైనే పదేళ్లు వర్క్‌ చేయలేం కదా’’ అంటూ కామెంట్‌ చేశారు కమల్‌.

అంతేకాదు ఆ మాట ఎందుకన్నారో కూడా చెప్పారు. ‘‘నాకు రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ పేరుతో నిర్మాణ సంస్థ ఉంది. శంకర్‌కి ఎస్‌ ప్రొడెక్షన్స్‌ ఉంది. ఈ రెండు సంస్థల్ని మేమే పోషించాలి కదా. అందుకోసం మేం బయటకు వెళ్లి పనిచేయాలి, చేస్తున్నాం’’ అని కమల్‌ వివరించారు. కమల్‌ భలే మాట అన్నారుగా, తనను నమ్ముకున్న టీమ్‌ గురించి. ఏదైనా కమల్‌, కమలే.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus