Kamal Hassan: మంచి మనస్సు చాటుకున్న కమల్ హాసన్.. ఆ విషయంలో గొప్పోడే!

భాషతో సంబంధం లేకుండా ఊహించని స్థాయిలో పాపులారిటీని కలిగి ఉన్న హీరోలలో కమల్ హాసన్ ఒకరనే సంగతి తెలిసిందే. కమల్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించగా గతేడాది విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ప్రాజెక్ట్ కే సినిమాలో కమల్ హాసన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కమల్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా కమల్ హాసన్ (Kamal Hassan) మంచి మనస్సును చాటుకున్నారు. మహిళా బస్ డ్రైవర్ కు కమల్ హాసన్ కారు గిఫ్ట్ గా ఇవ్వడం గమనార్హం. వివాదంలో చిక్కుకోవడం ద్వారా ఉద్యోగం కోల్పోయిన మహిళా బస్ డ్రైవర్ కు కమల్ హాసన్ తన వంతు సహాయం చేశారు. కమల్ కల్చరల్ సెంటర్ ద్వారా కమల్ హాసన్ ఈ కారును బహుమతిగా ఇవ్వడం గమనార్హం. మహిళా డ్రైవర్ షర్మిలను తన కార్యాలయానికి పిలిపించుకుని కమల్ హాసన్ ఈ బహుమతిని ఇచ్చారు.

ఇప్పటివరకు షర్మిల ఒక ఉద్యోగినిగా ఉండగా ఇకపై ఎంతోమందికి ఉపాధి కల్పించేలా ఎదగాలని కమల్ హాసన్ కామెంట్లు చేశారు. కమల్ హాసన్ విడుదల చేసిన ప్రకటనలో కోయంబత్తూర్ మహిళా బస్ డ్రైవర్ షర్మిల చుట్టూ జరిగిన చర్చలతో కలత చెందానని ఆయన అన్నారు. ఎంతోమంది యువతకు షర్మిల ఆదర్శం అని కమల్ చెప్పుకొచ్చారు. షర్మిల డ్రైవర్ గా ఉండకూడదని కమల్ పేర్కొన్నారు.

షర్మిల తనలాంటి వాళ్లను ఎంతోమందిని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నానని కమల్ చెప్పుకొచ్చారు. షర్మిల తనకు అందించిన కారును అద్దె సర్వీసుల కోసం వినియోగించుకోవచ్చని కమల్ కామెంట్లు చేశారు. 24 సంవత్సరాల వయస్సు ఉన్న షర్మిల కోయంబత్తూరులో తొలి మహిళా డ్రైవర్ కావడం గమనార్హం. ఉద్యోగం పోవడం గురించి షర్మిల మాట్లాడుతూ కండక్టర్ మాటలు నమ్మి యాజమాన్యం తనను అవమానపరిచిందని షర్మిల అన్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus