కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే కావ్య డిజైన్స్ వేస్తూ అన్నింటిని పూర్తి చేస్తుంది.నా తల్లిదండ్రులకు సహాయం చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చావు ఇది చేయి జారిపోకుండా చూసుకో భగవంతుడా అని ప్రార్థించి లోపలికి వెళ్తుంది అయితే రాజ్ ఇంకా పడుకొని ఉండేసరికి తన డిజైన్స్ అన్నింటిని కబోర్డ్ లో పెడుతుంది.
మరుసటి రోజు ఉదయం హాల్లో సుభాష్ ప్రకాష్ కూర్చొని ఉంటారు. వారికి ఇక కాఫీ అందించక సుభాష్ రాజ్ గదిలో ఫైల్ ఉంది దానిని తీసుకురమ్మని చెబుతాడు. సరేనని కావ్య పైకి వెళ్ళగా రాజ్ స్నానం చేస్తూ ఉంటాడు. ఫైల్ ఎక్కడుందని కావ్య అడగడంతో రాజ్ కబోర్డ్ లో ఉందని చెబుతాడు అయితే తనకు టవల్ ఇచ్చి వెళ్ళమని రాజ్ చెప్పగా కావ్య టవల్ ఇస్తూ డోర్ వేసిన సమయంలో తన పైట కొంగు లోపలే ఉండిపోతుంది.
కావ్య డోర్ తీయమని చెప్పినప్పటికీ రాజ్ తీయడు. మామయ్య ఫైల్ తీసుకురమ్మన్నారు నేను వెళ్ళాలి అని చెప్పినప్పటికీ ఆ రోజు నన్ను ఎంత ఏడిపించావు నేను ఒక గంట వరకు బయటకు రాను అప్పటివరకు అలాగే ఉండు అంటూ తన పై రివెంజ్ తీర్చుకుంటారు. కావ్య ఎంతసేపటికి రాకపోవడంతో ప్రకాష్ పైకి వచ్చి ఫైల్ ఎక్కడ అని అడుగుతాడు అక్కడ ఉందని చెప్పడంతో అలా మర్యాద లేకుండా నిలుచున్నావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.మావయ్య నన్ను అపార్థం చేసుకున్నారు అంటూ కావ్య చెప్పడంతో కిందికి వెళ్లేలోపు మర్చిపోతాడులే అని రాజ్ చెబుతాడు.
మరోవైపు అన్నపూర్ణ ఆరోగ్యం బాగుండదు తన ముక్కు నుంచి రక్తం కారుతుంది అది చూసిన కనకం కంగారు పడుతుంది.నా గురించి ఏమీ ఆలోచించొద్దు నాకు ఏమీ కాదు అని అన్నపూర్ణ చెప్పినప్పటికీ ఇలా మాకు ఇబ్బంది అవుతుందని దాచుకొని ఎంతటి వరకు తెచ్చుకున్న ముందు హాస్పిటల్ కి వెళ్దామని చెబుతుంది. అంతలోపే కృష్ణమూర్తి రావడంతో తనని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. మరోవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్ళగా కావ్య శృతికి ఫోన్ చేసి మీ బాస్ ఏమన్నారు అని అడగడంతో ఇంకా బాస్ రాలేదని చెబుతోంది. ఇక రాజ్ వెళ్లిన తర్వాత శృతి డిజైన్స్ తీసుకొని వెళుతుంది.
అయితే కావ్యకు ఫోన్ చేసి రాజ్ చెప్పేవన్నీ కావ్య వినేలా చేస్తుంది. డిజైన్స్ చూసినటువంటి రాజ్ చాలా అద్భుతంగా ఉన్నాయి అని పొగుడుతారు. అయితే శృతి ఇవి నేను కాదు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ గీసినవి అని చెబుతుంది. దాంతో రాజ్ తనని వెంటనే ఆఫీస్ కి రమ్మని చెప్పు అంటే తను ఆఫీసుకు రాదు తన ఇంట్లో చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు అందుకే డిజైన్ కు ఇంత ఇవ్వమని చెప్పింది అనడంతో సరే అకౌంటెంట్ వచ్చిన తర్వాత అమౌంట్ సెటిల్ చేయి అని రాజ్ చెబుతాడు.
ఈ మాటలన్నింటినీ కావ్య వింటుంది అకౌంటెంట్ రాగానే మీకు అమౌంట్ పంపిస్తామని చెబుతుంది శృతి. మరోవైపు స్వప్న తాను డైటింగ్ చేస్తానని చెప్పి రాహుల్ కు పెద్ద లిస్టు ఇస్తుంది ఆ సమయంలో రాహుల్ నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్న డైటింగ్ చేయడం ఏంటి అనగా అదంతా నేను చూసుకుంటాను ముందు ఈ లిస్ట్ లో ఉన్నవి తీసుకురా అని తనకు చెబుతుంది.
ఇక అన్నపూర్ణ డాక్టర్ దగ్గర వాళ్ళు అలాగే చెప్తారండి ఏదో కొన్ని మందులు రాసి పంపించండి అని చెబుతుంది. తరువాయి (Brahmamudi) భాగంలో రాజు కబోర్డ్ లో ఉన్న డిజైన్స్ అన్నింటిని చూస్తారు వెంటనే శ్రుతికి ఫోన్ చేసి మీ దగ్గరగా ఫ్రీ లాన్సర్ గా పనిచేస్తున్న ఆ డిజైనర్ పేరు ఏంటి అని ప్రశ్నిస్తారు. దీంతో శృతి ఇబ్బందిపడుతుంది.